AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush : టీజర్ పై డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ.. రీషూట్ చేయనున్న మేకర్స్.. సంక్రాంతికి రిలీజ్ అవుతుందా ?..

ప్రభాస్ సినిమాల కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‏ను బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ నిరాశపరిచాడు. ఆయన తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న

Adipurush : టీజర్ పై డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ.. రీషూట్ చేయనున్న మేకర్స్.. సంక్రాంతికి రిలీజ్ అవుతుందా ?..
Adipurush
Rajitha Chanti
|

Updated on: Nov 05, 2022 | 9:06 AM

Share

ప్రభాస్ సినిమా అంటే ఎన్నో అంచనాలు. ఒక్క అప్డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూసే ఫ్యాన్స్. ఇక మూవీ రిలీజ్ అంటే దేశవ్యాప్తంగా అభిమానులు చేసే రచ్చ గురించి తెలిసిందే. ప్రభాస్ సినిమాల కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‏ను బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ నిరాశపరిచాడు. ఆయన తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న క్రమంలో ఇటీవల విడుదలైన టీజర్‏పై దారుణంగా ట్రోల్స్ జరిగాయి. ఒకానొక సమయంలో సినీ విశ్లేషకులు సైతం ఈ టీజర్ పై మండిపడ్డారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో రాముడు.. రావణుడి లుక్స్ సరిగ్గా లేవని… హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఇప్పటికే ఢిల్లీలో ఆదిపురుష్ చిత్రయూనిట్ పై ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సినిమాకు గ్రాఫిక్స్ కూడా ఎక్కువైందంటూ నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ టీజర్ పై వస్తోన్న నెగిటివిటిని తగ్గించేందుకు మేకర్స్ అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

ఆదిపురుష్ చిత్రంలోని పలు సన్నివేశాలను రీషూట్ చేయాలని భావిస్తున్నారట. దాదాపు రూ. 500 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని మళ్లీ రీషూట్ చేస్తే సినిమా బడ్జెట్ మరింత పెరుగుతుందని అంచనా. అంటే చిత్రబృందానికి ఇది పెద్ద దెబ్బే అనుకోవాలి. అంతేకాకుండా మరోసారి డార్లింగ్ అభిమానులకు షాక్ ఇవ్వనున్నారట. రీషూట్ కారణంగా ఈ సినిమా విడుదల తేదీని మార్చాలని భావిస్తున్నారట. కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్‌ఎక్స్‌ని రీవర్క్ చేయాలని టీమ్ నిర్ణయించుకుందట… జిల్టీ తరహాలో షూట్ చేసిన రావణుడి పాత్రను మార్చనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ క్యారెక్టర్ పూర్తిగా మారిస్తే బడ్జెట్ మరింత పెరగడం ఖాయం.

ఇవి కూడా చదవండి

అయితే ఈ చిత్రాన్ని ముందుగా 2023 జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు పలు సన్నివేశాలు రీషూట్ చేయాల్సి రావడంతో సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలనుకుంటున్నారట. సంక్రాంతికి పలు బడ్జెట్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా వెనకడుగు వేయనున్నట్లు టాక్. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం సంక్రాంతికి ఆదిపురుష్ రావడం మాత్రం అనుమానమే. ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటించలేదు.

Follow Us
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు