DDLJ Remake: మళ్లీ వెండి తెరపై సందడి చేయనున్న అద్భుత ప్రేమ కథ.. డీడీఎల్‌ రీమేక్‌‏లో టాలీవుడ్‌ స్టార్ హీరో..

బాలీవుడ్ బాద్ షా నటించిన దిల్ వాలే దుల్హానియా లే జాయింగే ఒకటి. ఇందులో షారుఖ్ సరసన కాజోల్ నటించింది. ఈ మూవీతో ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఆన్ స్క్రీన్ జోడీగా నిలిచిపోయారు కాజోల్,షారుఖ్.

DDLJ Remake:  మళ్లీ వెండి తెరపై సందడి చేయనున్న అద్భుత ప్రేమ కథ.. డీడీఎల్‌ రీమేక్‌‏లో టాలీవుడ్‌ స్టార్ హీరో..
Ddlj Remake
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2022 | 1:46 PM

వెండితెరపై ఎన్ని ప్రేమకథలు సందడి చేసినా.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన అద్భుతమైన ప్రేమకథలు అతి తక్కువగా ఉంటాయి. అందులో బాలీవుడ్ బాద్ షా నటించిన దిల్ వాలే దుల్హానియా లే జాయింగే ఒకటి. ఇందులో షారుఖ్ సరసన కాజోల్ నటించింది. ఈ మూవీతో ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఆన్ స్క్రీన్ జోడీగా నిలిచిపోయారు కాజోల్,షారుఖ్. డైరెక్టర్ అదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ అందమైన ప్రేమకావ్యం అప్పట్లో అన్ని రికార్డ్‏లను బద్దలు కొట్టింది. భారీగా వసూళ్లు రాబట్టడమే కాకుండా కాకుండా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకుల అనుభూతికి తగినట్టుగా స్టోరీ డిజైన్ చేసి రీమేక్ చేయాలని భావిస్తున్నారట. కొద్దిరోజులుగా ఈ సినిమా స్క్రీప్ట్ పై మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ రీమేక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సూపర్ హిట్ రీమేక్‏లో షారుఖ్ స్థానంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ ఆదిత్య చోప్రా విజయ్ ను కలిసి ఈ మూవీ గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేదా.. నేషనల్ క్రష్ రష్మికను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారట. అయితే ఇప్పటివరకు డీడీఎల్ రీమేక్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ సినిమా రీమేక్‏లో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్.. లేదా కుమార్తె సుహానా నటించనున్నారని ముందు నుంచి టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు అనుహ్యంగా విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకుల ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విజయ్ కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే రెండు మెగా ప్రాజెక్ట్ ఆఫర్స్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో