Vijay Sethupathi: మరో స్టార్ హీరో సినిమాలో విజయ్ సేతుపతి.. మలయాళీ సూపర్ స్టార్‌తో మక్కల్ సెల్వన్..
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న మైఖేల్, విడుదలై, జవాన చిత్రాల్లో కీలకపాత్రలలో నటిస్తున్నారు విజయ్. వెండితెరపై హీరోగానే కాకుండా.. భాషతో సంబంధం లేకుండా కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లో కీలకపాత్రలతో మెప్పిస్తున్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా విజయ్ సేతుపతి క్రేజ్ మారిపోయింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. అప్పటివరకు హీరోగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న విజయ్.. ప్రతి నాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కేవలం హీరోయిజం మాత్రమే కాకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్ట్స్ ఓకే చేస్తుంటారు. ప్రస్తుతం విజయ్.. గాందీ టాకీస్, మేరీ క్రిస్మస్ చిత్రాల్లో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
అలాగే.. యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న మైఖేల్, విడుదలై, జవాన చిత్రాల్లో కీలకపాత్రలలో నటిస్తున్నారు. వెండితెరపై హీరోగానే కాకుండా.. భాషతో సంబంధం లేకుండా కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లో కీలకపాత్రలతో మెప్పిస్తున్నారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయ్ నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.ే
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తోన్న లేటేస్ట్ ప్రాజెక్ట్‌లో విజయ్ భాగం కానున్నారట. ఈ సినిమాలో మమ్ము్ట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి విజయ్ సిద్ధమవుతున్నారని టాక్. ఈ చిత్రానికి మణికంఠన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో విజయ్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.