Pawan Kalyan: సీన్ మెగాస్టార్‌ది.. యాక్షన్ పవర్ స్టార్‌ది.. అచ్చం గాడ్ ఫాదర్ సినిమాలోలానే
తాను స్థాపించిన జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన నిత్యం ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు జరిగిన అన్యాయాల పై గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు తన పై విమర్శలు చేస్తున్న వారి పై సభ పెట్టి మరీ బహిరంగంగా వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక రాజకీయంలో అయితే అధికారపార్టీ పై ఓ యుద్ధమే చేస్తున్నారు పవన్. తాను స్థాపించిన జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన నిత్యం ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు జరిగిన అన్యాయాల పై గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు తన పై విమర్శలు చేస్తున్న వారి పై సభ పెట్టి మరీ బహిరంగంగా వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు పవన్. ఈసారి ఎలాగైనా తన జనసేన పార్టీని గెలిపించుకొని ప్రజల కోసం పని చేయాలనీ కసి మీద ఉన్నారు. అయితే ఆయన చేసే ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ ఇప్పటికే పలుసార్లు పవన్ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసిన సరే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీకోసం పని చేసిన ప్రజల ఇండ్లను ప్రభుత్వం కూల్చివేస్తుందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణకు అడ్డువస్తున్నాయని అక్కడి ప్రజల ఇళ్లను కూల్చి వేయాలని అధికారులు ఆదేశించారు. ఆ ప్రకారమే సంబంధిత అధికారులు ప్రజల ఇండ్లను కూల్చి వేయడానికి ప్రయత్నించారు. దాని అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారు.




అయితే ప్రోటోకాల్ పేరుతో పవన్ వెళ్తున్న వాహనాన్ని పోలీసులు ఆపేశారు. దాంతో ఆగ్రహంతో పవన్ కాలి నడకన వెళ్లారు. ఆయన వెంట ప్రజలు కూడా కదిలారు. అయితే ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఇదే సీన్ ఉంది. ఆ సినిమాలో చిరుని కూడా ఇలానే ఆపేస్తే ఆయన నడిచి వెళ్తారు. ఆయన వెంట ప్రజలు సైన్యంలా కదులుతారు. సరిగ్గా ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది. దాంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సీన్ అన్నది యాక్షన్ తమ్ముడిది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
#JanaSenaWithIppatam #Pawankalyan #ippatamvillage pic.twitter.com/3PjidNmw51
— Durgasi Sekhar (@DurgasiSekhar) November 5, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.