AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Bhagyashree: ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త.. అసలేమైందంటే?

ప్రముఖ సీనియర్‌ నటి భాగ్య శ్రీ భర్త హిమాయ్‌ దస్సానీ ఆస్పత్రిలో చేరారు. అతని కుడి భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని భాగ్యశ్రీనే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది.

Actress Bhagyashree: ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త.. అసలేమైందంటే?
Actress Bhagyashree
Basha Shek
|

Updated on: Nov 05, 2022 | 6:05 PM

Share

ప్రముఖ సీనియర్‌ నటి భాగ్య శ్రీ భర్త హిమాయ్‌ దస్సానీ ఆస్పత్రిలో చేరారు. అతని కుడి భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని భాగ్యశ్రీనే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఆస్పత్రిలో భర్తతో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘భుజంలోని రొటేటర్‌ కఫ్‌ సాయంతోనే చేతిని 360 డిగ్రీల కోణంలో తిప్పగలం. రొటేటర్‌ కఫ్‌ సరిగా లేదంటే కండరాలకు రక్తప్రసరణ ఆగిపోతుంది. చేతులు కదలిక కోల్పోతాయి. డాక్టర్లు నా భర్త భుజంలోని రొటేటర్‌ కఫ్‌కు విజయవంతంగా సర్జరీ చేశారు. ఇందుకు సుమారు నాలుగన్నర గంటల సమయం పట్టింది. ఇప్పుడతను కోలుకుంటున్నాడు. తిరిగి నవ్వుతున్నాడు’ అని రాసుకొచ్చింది భాగ్యశ్రీ. కాగా ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దస్సానీ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. కాగా సల్మాన్ ఖాన్ సరసన మైనే ప్యార్‌ కియా (తెలుగులో ప్రేమ పావురాలు) సినిమాతో ఓవర్‌నైట్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది . అయితే వన్‌ ఫిల్మ్‌ వన్‌ వండర్‌లా కేవలం ఒక్క సినిమాకే పరిమితమైంది.

మైనే ప్యార్‌ కియా తర్వాత బాలకృష్ణ యువరత్న రాణాతో పాటు కొన్ని కన్నడ, తమిళ్‌, బెంగాలీ సినిమాల్లో భాగ్యశ్రీ నటించింది. అయితే అవన్నీ పూర్తి స్థాయి పాత్రలు కాదు. 1990లో హిమాలయ్‌ దస్సానీతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిందీ అందాల తార. వీరికి అభిమన్యు అనే కుమారుడు, అవంతిక అనే కూతురు ఉన్నారు. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైన భాగ్యశ్రీ చాలా ఏళ్ల తర్వాత రాధేశ్యామ్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. అంతకుముందు కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన తలైవీలోనూ మెరిసింది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ కుమారుడు, కూతురు కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఇప్పటికే కుమారుడు అభిమన్యు దుస్సాని బాలీవుడ్‌లో నటుడిగా పరిచయమ్యాడు. కుమార్తె అవంతిక దుస్సానీ కూడా మిత్యా వెబ్‌సిరీస్‌తో వెండితెరకు పరిచయమైంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోకి కూడా ఎంటర్‌ అవుతోంది. బెల్లంకొండ గణేశ్‌ హీరోగా నటిస్తోన్న నేను స్టూడెంట్ సార్‌లో అవంతిక కథానాయికగా ఎంపికైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..