Oreo Omelette: ఓరియో బిస్కెట్లు, చాక్లెట్‌ సిరప్‌తో వెరైటీ ఆమ్లెట్‌.. వాంతి వస్తోందంటోన్న ఫుడ్‌ లవర్స్‌

గతంలో ఓ వీధి వ్యాపారి ఓరియో బిస్కెట్లతో బజ్జీలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆతర్వాత ఓ వీధి వ్యాపారి ఇదే ఓరియో బిస్కెట్లు, జీరా సోడాతో కలిసి ఆమ్లెట్లు తయారుచేసి షాక్‌ ఇచ్చాడు. ఇప్పుడు కూడా సేమ్‌ అలాంటిదే.. ఓరియో బిస్కెట్లు, చాక్లెట్‌ సిరప్‌తో కలిసి ఆమ్లెట్లను తయారు చేశాడు.

Oreo Omelette: ఓరియో బిస్కెట్లు, చాక్లెట్‌ సిరప్‌తో వెరైటీ ఆమ్లెట్‌.. వాంతి వస్తోందంటోన్న ఫుడ్‌ లవర్స్‌
Oreo Omelette
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2022 | 7:59 PM

రెగ్యులర్‌ వంటకాలు తిని విసుగెత్తిందేమో కానీ ఇటీవల కొందరు వినూత్న వంటకాలు ట్రై చేస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్లతో వెరైటీ రెసిపీలు తయారుచేస్తున్నారు. తయారుచేయడమే కాదు వాటి మేకింగ్‌ వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఈ వెరైటీ వంటకాల్లో కొన్ని బాగుంటే.. మరికొన్ని మాత్రం వికారం, వాంతులు తెప్పిస్తున్నాయి. తాజాగా అలాంటి వినూత్న వంటకం ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. గతంలో ఓ వీధి వ్యాపారి ఓరియో బిస్కెట్లతో బజ్జీలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆతర్వాత ఓ వీధి వ్యాపారి ఇదే ఓరియో బిస్కెట్లు, జీరా సోడాతో కలిసి ఆమ్లెట్లు తయారుచేసి షాక్‌ ఇచ్చాడు. ఇప్పుడు కూడా సేమ్‌ అలాంటిదే.. ఓరియో బిస్కెట్లు, చాక్లెట్‌ సిరప్‌తో కలిసి ఆమ్లెట్లను తయారు చేశాడు. సాధారణంగా ఆమ్లెట్ చూడగానే నోటిలో నీళ్లు వస్తాయి కానీ.. ఆ ఆమ్లెట్‌ను చూసిన తర్వాత కచ్చితంగా వాంతులు అవుతాయి. నిజమే అంతలా అసహ్యమేస్తోంది ఈ  వెరైటీ రెసిపీని చూస్తోంటే..

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి మొదట గుడ్డు పగలగొట్టి గ్లాస్‌లో పోస్తాడు. ఆపై ఓరియో బిస్కెట్‌ను పగలగొట్టి, ఆపై దానిపై చాక్లెట్ సిరప్ పోసి గిలక్కొట్టుతాడు. ఆపై ప్యాన్‌లో వేయిస్తాడు. చివరిగా దానిపైకి తరిగిన ఉల్లిపాయలు, మిర్చీ, కొత్తిమీర, నిమ్మరసంతో పాటు మిగిలిపోయిన ఓరియో కుకీస్‌తో గార్నిషింగ్‌ టచ్‌ ఇచ్చి సర్వర్లకు అందిస్తున్నాడు. foodie_tshr అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వెరైటీ రెసిపీ చూసిన నెటిజన్లను తెగ ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన ఆహార ప్రేమికులు విస్తుపోతున్నారు. ఇదేం ఐడియారా బాబు, ఇది చాలా దారుణం, దీనిని చూసిన తర్వాత ఇంకోసారి ఆమ్లెట్లు తినాలన్న కోరికే చచ్చిపోయింది’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు