పులితోనే ఆటలాడాలనుకున్నాడు...ప్రాణాలు పోగొట్టుకున్నాడు!

పులితోనే ఆటలాడాలనుకున్నాడు…ప్రాణాలు పోగొట్టుకున్నాడు!

Phani CH

|

Updated on: Nov 06, 2022 | 7:40 PM

సాధారణంగా జూకి వెళ్లిన పర్యాటకులు అక్కడి జంతువులను చూసి వాటికి దగ్గరగా వెళ్లాలనుకుంటారు. వాటిలో సెల్ఫీలు దిగాలనో, వాటికి స్వయంగా ఆహారం అందించాలనో ఎన్‌క్లోజర్స్‌ దగ్గరకి వెళ్తారు.

సాధారణంగా జూకి వెళ్లిన పర్యాటకులు అక్కడి జంతువులను చూసి వాటికి దగ్గరగా వెళ్లాలనుకుంటారు. వాటిలో సెల్ఫీలు దిగాలనో, వాటికి స్వయంగా ఆహారం అందించాలనో ఎన్‌క్లోజర్స్‌ దగ్గరకి వెళ్తారు. అక్కడ ఎన్‌క్లోజర్‌లో ఉన్న జంతువులను తాకాలని ప్రయత్నిస్తారు. అలా ఓ వ్యక్తి ఏకంగా పులితోనే ఆటలాడుకోవాలనుకున్నాడు. పులి ఎన్‌క్లోజర్‌ దగ్గరకు వెళ్లాడు. ఎన్‌క్లోజర్‌ గ్రిల్‌ లోపలికి చేయి పెట్టి పులిని పిలిచాడు. అది దగ్గరకు వచ్చింది. దాని తలపై చేయి పెట్టి నిమిరాడు. తర్వాత పులి అక్కడినుంచి వెనక్కి వెళ్లిపోయింది. ఆ వ్యక్తి చేయి లోపలికి పెట్టి మళ్లీ పులిని పిలిచాడు. మొదటిసారి శాంతంగానే ఉన్న పులి ఈసారి ఊహించని షాకిచ్చింది. ఆ వ్యక్తి చేయిని కొరికేసింది. దాంతో ఆవ్యక్తి బాధతో పెద్దగా అరవడం ప్రారంభించినా పులి అతడిని వదల లేదు. ఇదంతా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా పులి దాడిలో అధిక రక్తస్రావం అయింది. షాక్ తో జోస్‌కు గుండెపోటు వచ్చి మరణించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఓ యూజర్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షిస్తూ లైక్‌ చేస్తున్నారు. వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. జూలకు వెళ్లినప్పుడు క్రూర మృగాలతో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఈ బుడ్డది రష్మికను మించిపోయిందిగా

ట్రైన్‌లో ఆ భార్యభర్తలు చేసినపనికి !! అందరూ చూస్తుండగానే..

సిల్లీ రీజన్‌తో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

అద్భుతం !! నదిలో కొట్టుకుపోతోన్న కోతిని కాపాడిన హనుమంతుడు..

లక్ష సార్లు ‘రామ’ అని రాసింది.. అద్భుతం ఆవిష్కృతమైంది !!

 

Published on: Nov 06, 2022 07:40 PM