AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waltair Veerayya: మెగాస్టార్‌ మూవీలో మరో సూపర్‌స్టార్‌.. సోలోమాన్‌ సీజర్‌గా బాబీ సింహా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

వాల్తేరు వీరయ్య సినిమాలో మరో సూపర్‌ స్టార్‌ భాగం కానున్నాడు. తన నటనతో నేషనల్‌ అవార్డుతో సహా ఎంతో మంది అభిమానులను సొంత చేసుకున్న కోలీవుడ్‌ నటుడు బాబీ సింహా మెగా 154లో ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.

Waltair Veerayya: మెగాస్టార్‌ మూవీలో మరో సూపర్‌స్టార్‌.. సోలోమాన్‌ సీజర్‌గా బాబీ సింహా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌
Bobby Simha,chiranjeevi
Basha Shek
|

Updated on: Nov 06, 2022 | 8:27 PM

Share

గాడ్‌ఫాదర్‌తో మంచి హిట్టు కొట్టిన మెగాస్టార్‌ చిరంజీవి త్వరలో వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాబీ అలియాస్‌ కేఎస్‌ రవీంద్ర తెరకెక్కిస్తోన్న ఈ మెగా మూవీలో మాస్‌ మహారాజా రవితేజ ఓ పవర్‌ ఫుల్‌ పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే విడుదలైన మెగా 154 మూవీ పోస్టర్ల్స్‌, గ్లింప్స్‌, టైటిల్‌ టీజర్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మెగాస్టార్‌, మాస్‌ మహారాజాను కలిసి తెరపై చూసేందుకు ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా వాల్తేరు వీరయ్య సినిమాలో మరో సూపర్‌ స్టార్‌ భాగం కానున్నాడు. తన నటనతో నేషనల్‌ అవార్డుతో సహా ఎంతో మంది అభిమానులను సొంత చేసుకున్న కోలీవుడ్‌ నటుడు బాబీ సింహా మెగా 154లో ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. అతని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సోలమన్ సీజర్‌ గా చిత్రంలోని ఆయన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మూవీ మేకర్స్. టక్ చేసుకున్న పూల చొక్కా, మెడలో బంగారు గొలుసులు, చేతికి బంగారు కడియం, గడియారం, నల్లటి కళ్లజోడుతో వింటేజ్ లుక్‌లో అదరగొట్టారు బాబీ సింహ. ఫస్ట్ లుక్ చూస్తుంటే వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని ఢీకొట్టే విలన్‌ పాత్రలో బాబీ నటిస్తున్నాడని తెలుస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ చాలా రోజుల తర్వాత మెగాస్టార్‌ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. మెగా డాటర్‌ సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..