Samantha: చికిత్స తీసుకుంటూనే సినిమా ప్రమోషన్లకు.. సామ్‌ డెడికేషన్‌పై ప్రశంసల వెల్లువ

తనకున్న సమస్యను ప్రకటించినప్పుడు కూడా మొహం చూపించని సామ్‌ తాజా ఫొటోల్లో చాలా బలహీనంగా కనిపిస్తోంది.  అయితే హెల్త్‌ కండీషన్‌ సరిగా లేకున్నా సినిమా కోసం సామ్‌ డెడికేషన్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Samantha: చికిత్స తీసుకుంటూనే సినిమా ప్రమోషన్లకు.. సామ్‌ డెడికేషన్‌పై ప్రశంసల వెల్లువ
Samantha
Follow us
Basha Shek

|

Updated on: Nov 07, 2022 | 3:32 PM

ప్రముఖ టాలీవుడ్‌ నటి సమంత మళ్లీ రంగంలోకి దిగింది. మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ఆమె తన లేటెస్ట్‌ సినిమా యశోద ప్రమోషన్ల కోసం సిద్ధమైంది. అనారోగ్య పరిస్థితులతో శరీరం సహకరించేలేకపోయినా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకుంది. ఈ మేరకు సమంత షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  తనకున్న సమస్యను ప్రకటించినప్పుడు కూడా మొహం చూపించని సామ్‌ తాజా ఫొటోల్లో చాలా బలహీనంగా కనిపిస్తోంది.  అయితే హెల్త్‌ కండీషన్‌ సరిగా లేకున్నా సినిమా కోసం సామ్‌ డెడికేషన్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో పోషిస్తోన్న యశోద నవంబర్‌ 11న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. సరోగసీ నేపథ్యంలో హరి- హరీశ్‌ సంయుక్తంగా ఈ థ్రిల్లర్‌ను రూపొందించారు. ఈ సినిమాలో ఉన్నీ ముకుందన్‌, వరలక్ష్మి, రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌ తదితర ప్రముఖులు నటిస్తున్నారు.

కాగా రిలీజ్‌ టైం దగ్గర పడుతుండడంతో ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అయితే అనారోగ్యం కారణంగా సామ్‌ ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటుందనుకున్నారు. మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్‌ అందుకు తగిన చికిత్స తీసుకుంటుంది. అయితే సినిమా సకాలంలో పూర్తి చేయాలని భావించి డాక్లర్ల పర్యవేక్షణలో సెలైన్‌ పెట్టుకొని మరీ డబ్బింగ్‌ పూర్తి చేసింది. ఈ విషయాన్ని యశోద నిర్మాతే స్వయంగా తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం దాదాపు కష్టమే అని నిర్మాతలు సహా చాలామంది అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్వర్యపరుస్తూ సమంత యశోద ప్రమోషన్స్‌కు సిద్ధమైంది .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!