Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: బుల్లితెర సావిత్రి.. వంటలక్క ఆస్తుల చిట్టా ఓ రేంజ్‌లో ఉందిగా..

బుల్లితెరలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇక మెయిన్‌ క్యారెక్టర్‌ పాత్రలో ఒదిగిపోయిన వంటలక్క అలియాస్‌ ప్రేమి విశ్వనాథ్ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! అంతగా తెలుగువారి మనసుకు..

Karthika Deepam: బుల్లితెర సావిత్రి.. వంటలక్క ఆస్తుల చిట్టా ఓ రేంజ్‌లో ఉందిగా..
Premi Viswanath Asset Value
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 07, 2022 | 6:56 PM

బుల్లితెరలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇక మెయిన్‌ క్యారెక్టర్‌ పాత్రలో ఒదిగిపోయిన వంటలక్క అలియాస్‌ ప్రేమి విశ్వనాథ్ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! అంతగా తెలుగువారి మనసుకు దగ్గరయ్యారు. ఆమె అసలు పేరుకన్నా వంటలక్కగానే ప్రేక్షకలోకం గుర్తుపడుతుంది. స్టార్ మాలో ప్రత్యక్షమయ్యే కార్తీకదీపం సీరియల్‌లో ప్రేమి విశ్వనాథ్ పాత్ర తెలుగు ప్రేక్షకలోకాన్ని కట్టిపడేసింది. ఇక టీఆర్పీ రేటింగ్‌లో ఈ సీరియల్‌ను బీట్‌ చేసే మరో సీరియల్‌ లేనేలేదు. తాజాగా కార్తీకదీపం సీరియల్‌ 1500 ఎపిసోడ్‌ కూడా దాటేసింది. ఈ సీరియల్‌లో కేవలం ప్రేమి విశ్వనాథ్ నటనను చూసేందుకే అధిక ప్రాధాన్యత ఉందనేది జగమెరిగిన సత్యం. ఐతే ఈ కేరళ కుట్టి కేవలం కార్తీక దీపం సీరియల్‌లో మాత్రమే నటించడం విశేషం. ఇతర ఏ టీవీ కార్యక్రమాలు, సినిమాలు, సీరియల్‌లలో నటించడం లేదట. అందుకు కారణం లేకపోలేదు. నిజానికి.. ప్రేమి విశ్వనాధ్ కొన్ని కోట్ల ఆస్తులకు అధిపతి.

ఆమెకు కేరళలో 2 అతిపెద్ద స్టూడియోలు ఉన్నాయని ప్రేమి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వీటితోపాటు ఖరీదైన ఇళ్ళు, లగ్జరీ కార్లతో కాలిపి దాదాపు రూ. 40 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ప్రేమి భర్త వినీత్ భట్ ప్రముఖ జ్యోతిష్కుడు. ఆస్ట్రాలజీ విభాగంలో ఆయన పలు అంతర్జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ప్రేమి పాపులారిటీ చూసీ సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయట. అక్కినేని హీరో నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న మూవీలో బుల్లితెర క్వీన్‌ ప్రేమి విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది కూడా. తెలుగు తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ మువీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్ మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.