Telangana: ప్రభుత్వం Vs గవర్నర్.! కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటుపై యూజీసీకి గవర్నర్‌ లేఖ

ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. తాజాగా యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటుపై ప్రభుత్వానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై లేఖాస్త్రం సంధించారు. రాజ్‌భవన్‌కు వచ్చి ఈ బిల్లుపై చర్చించాలని విద్యాశాఖ మంత్రికి సూచించారు. అటు యూజీసీకి..

Telangana: ప్రభుత్వం Vs గవర్నర్.! కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటుపై యూజీసీకి గవర్నర్‌ లేఖ
TS Governor Tamilisai wrote letter to UGC
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 07, 2022 | 5:52 PM

ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. తాజాగా యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటుపై ప్రభుత్వానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై లేఖాస్త్రం సంధించారు. రాజ్‌భవన్‌కు వచ్చి ఈ బిల్లుపై చర్చించాలని విద్యాశాఖ మంత్రికి సూచించారు. అటు యూజీసీకి కూడా లెటర్ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడం చెల్లుబాటు అవుతుందా? అంటూ యూజీసీ అభిప్రాయం కోరారు.

గత 3 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయండి అని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా అధ్యాపకుల ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న విధానంలో త్వరగా.. పారదర్శకంగా.. మంచి ప్రమాణాలతో రిక్రూట్మెంట్ చేయడంలో ఉన్న ఇబ్బందులేమిటని లేఖలో ప్రశ్నించారు. కొత్త విధానంతో లీగల్ సమస్యలు ఎదురైతే, ఖాళీల భర్తీ మరింత ఆలస్యం అవుతుందని.. అప్పుడు నిరుద్యోగులకు మరింత ఇబ్బందులు ఏర్పడుతాయని గవర్నర్ అన్నారు.

అసలేంజరిగిందంటే..

వాస్తవానికి సెప్టెంబర్‌-13న రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఆమోదించిన మొత్తం 8 బిల్లులను ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదముద్ర కోసం పంపించింది. వాటిని పరిశీలించి, ఆమోదించిన తర్వాతే గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది. అప్పుడే బిల్లులు చట్టరూపంలోకి వస్తాయి. అయితే ఈ 8 బిల్లుల్లో కేవలం జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే తమిళిసై ఆమోదం తెలిపారు. మిగిలిన ఏడు బిల్లులు దాదాపు 50 రోజులుగా పెండింగ్‌లోనే ఉన్నాయి..

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఈ 7 బిల్లుల్లోనే యూనివర్సిటీల్లో కొలువుల భర్తీకి కామన్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసే బిల్లు కూడా ఉంది. దీనికి గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఓ ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసి ఖాళీలు భర్తీ చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఇప్పుడు ఈ బిల్లుపైనే గవర్నర్ అభ్యంతరం తెలిపారు. అసలు ఈ కొత్త పద్ధతి ఎందుకు? పాత విధానంలో ఉన్న ఇబ్బందులేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.