NITTTR Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో నెలకు రూ.2 లక్షలకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన పంజాబ్‌లోని చండీగఢ్‌లోనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్.. 28 అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రొడ్యూసర్‌, ఎస్టేట్ ఆఫీసర్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌ తదితర పోస్టుల..

NITTTR Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో నెలకు రూ.2 లక్షలకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
NITTTR Chandigarh Recruitment 2022
Follow us

|

Updated on: Nov 07, 2022 | 3:16 PM

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన పంజాబ్‌లోని చండీగఢ్‌లోనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్.. 28 అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రొడ్యూసర్‌, ఎస్టేట్ ఆఫీసర్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్‌, పీజీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్టెనో, టైపింగ్ స్కిల్స్‌ కూడా ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం అవసరం. అభ్యర్ధుల వయసు 65 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 16, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నవంబర్‌ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది (నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు నవంబర్‌ 30వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది). ఐతే దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 3
  • సీనియర్ ప్రొడ్యూసర్‌ పోస్టులు: 1
  • ఎస్టేట్ ఆఫీసర్ పోస్టులు: 1
  • సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌ పోస్టులు: 2
  • టెక్నీషియన్ పోస్టులు: 3
  • స్టెనో గ్రేడ్-2 పోస్టులు: 5
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎల్‌డీసీ) పోస్టులు: 13

అడ్రస్:

Faculty Incharge (Administration), National Institute of Technical Teachers Training & Research (NITTTR), Sector 26, Chandigarh – 160019.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.