Job Offer: ఫ్రీగా హెలికాఫ్టర్‌లో తిరుగుతూ పక్షులను చూస్తే చాలు.. నెలకు రూ.మూడున్నర లక్షల జీతం..ఎక్కడంటే!

ప్రపంచమంతా తిరిగి హాయిగా పక్షులను చూస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చని మీకు తెలుసా. అవును! ఇలాంటి జాబ్‌లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఫ్రీగా హెలికాఫ్టర్‌లో తిరగొచ్చు కూడా. ఇదేదో ఫేక్‌ వార్త అని..

Job Offer: ఫ్రీగా హెలికాఫ్టర్‌లో తిరుగుతూ పక్షులను చూస్తే చాలు.. నెలకు రూ.మూడున్నర లక్షల జీతం..ఎక్కడంటే!
This country is offering a Rs 3.5 lakh-salary job to protect rare species
Follow us

|

Updated on: Nov 06, 2022 | 7:23 PM

ప్రపంచమంతా తిరిగి హాయిగా పక్షులను చూస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చని మీకు తెలుసా. అవును! ఇలాంటి జాబ్‌లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఫ్రీగా హెలికాఫ్టర్‌లో తిరగొచ్చు కూడా. ఇదేదో ఫేక్‌ వార్త అని కొట్టిపారేయకండి. సాక్షాత్తు యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ నుంచి ఈ విధమైన జాబ్‌ ఆఫర్‌ వెలువడడం విశేషం.

న్యూజిలాండ్‌లోని వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌లలోని సరిహద్దు ప్రాంతాల్లో బయోడైవర్సిటీ సూపర్‌వైజర్ ఉద్యోగాలకు వారం క్రితం ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు అంతర్జాతీయంగా సరైన అభ్యర్ధుల కోసం అన్వేషిస్తోంది. కొలంబియా నుంచి స్వీడెన్‌ వరకు ఎంతో మంది ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైన వారు న్యూజిలాండ్‌ సౌత్‌ ఐలాండ్‌కు చెందిన పశ్చిమ తీరంలో హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తూ అత్యంత అరుదైన పక్షి జాతులను గుర్తించి, వాటి సంరక్షణ చేబడితే చాలు.. ఏడాదికి దాదాపు రూ.42 లక్షల వరకు జీతంగా పొందవచ్చు. అంటే నెలకు రూ.3.5 లక్షల జీతం అన్నమాట. ముఖ్యంగా కివి పక్షులు, పెంగ్విన్లు, బల్లి జాతులను పర్వవేక్షించవల్సి ఉంటుంది.

గత నెలలో న్యూజిలాండ్ కన్జర్వేషన్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ప్రకటనలో ఈ జాబ్‌లకు కేవలం ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. బయోడైవర్సిటీ సూపర్‌వైజర్ పోస్టులకు ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించడంతో దరఖాస్తులు వెల్లువెత్తినట్లు న్యూజిలాండ్ కన్జర్వేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇప్పటివరకు డిపార్ట్‌మెంట్‌కు ఫిన్‌లాండ్, రొమేనియా, పరాగ్వే, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి దాదాపు1,400 దరఖాస్తులు వచ్చాయట. ప్రపంచాన్ని చుట్టేయాలని కలలు కనే వారికి ఇది మంచి అవకాశం. మీరూ ఓ లుక్కేయండి..!

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.