- Telugu News Photo Gallery World photos US Man Claps 1,140 Times In One Minute For Guinness World Record
Guinness World Record: చప్పట్లు కొట్టి రికార్డ్ సృష్టించిన యువకుడు.. నిమిషంలో ఎన్ని సార్లు చప్పట్లు కొట్టాడో తెలుసా..
ఒక నిమిషంలో మీరు ఎన్నిసార్లు చప్పట్లు కొట్టగలరు? మహా అయితే 10-20 సార్లు లేదా గరిష్టంగా 50 సార్లు, కానీ అమెరికాలో నివసిస్తున్న 20 ఏళ్ల కుర్రాడు ఒక నిమిషంలో మొత్తం 1140 సార్లు చప్పట్లు కొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకుడు. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
Updated on: Nov 06, 2022 | 6:04 PM

ప్రపంచ రికార్డు సృష్టించడం అంత తేలికైన విషయం కాదు. దీని కోసం చాలా రకరకాల కష్టాలు పడాలి. వివిధ రకాల ప్రపంచ రికార్డుల గురించి విని ఉంటారు. అయితే చప్పట్లు కొట్టడం ద్వారా కూడా ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును సృష్టించవచ్చని మీకు తెలుసా? అవును, అలాంటి రికార్డు అమెరికాలో ఉంటున్న ఓ యువకుడు తన పేరుతొ నమోదు చేసుకున్నాడు.

మీరు ఒక నిమిషంలో ఎన్నిసార్లు చప్పట్లు కొట్టగలరు అని అడిగితే, సమాధానంగా మీరు 10-20 సార్లు లేదా గరిష్టంగా 50 సార్లు చెబుతారు, కానీ 20 ఏళ్ల కుర్రాడు ఒక నిమిషం చప్పట్లు కొట్టాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ యువకుడు ఒక్క నిమిషంలో మొత్తం 1140 సార్లు చప్పట్లు కొట్టాడు.

డాల్టన్ మేయర్ అనే యువకుడు కేవలం ఒక సెకనులో 19 సార్లు చప్పట్లు కొట్టాడు .. అలా ఒక నిమిషంలో చప్పట్లు కొట్టి.. తన పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం నిమిషంలో ఎక్కువ సార్లు చప్పట్లు కొట్టిన వ్యక్తిగా ప్రపంచ ఖ్యాతిగాంచాడు.

మీడియా నివేదికల ప్రకారం, డాల్టన్ మేయర్ ఈ రికార్డ్ ను సృష్టించడానికి మణికట్టు-చప్పట్లు కొట్టే పద్ధతిని ఉపయోగించాడు. ఈ టెక్నిక్‌లో, మణికట్టు, వేళ్లను ఉపయోగించి మరొక చేతి అరచేతితో చప్పట్లు కొట్టాడు.

డాల్టన్ మేయర్ మార్చి నెలలోనే ఈ ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును సృష్టించారు, అయితే ఈ రికార్డు అక్టోబర్ 31 వరకు ఆమోదించబడలేదు. అయితే, ఇప్పుడు ఈ రికార్డు అధికారికంగా ఆమోదించబడింది.





























