AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంజనీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్‌సీ కీలక ఆదేశాలు..’మెరిట్‌లేని విద్యార్ధులకు సీట్లు ఇస్తే భారీ జరిమానా’

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మెరిట్ లేని విద్యార్ధులకు బీ కేటగిరీ కింది అడ్మిషన్లు ఇస్తే ఒక్కోసీటుకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించనున్నట్లు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ శనివారం..

ఇంజనీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్‌సీ కీలక ఆదేశాలు..'మెరిట్‌లేని విద్యార్ధులకు సీట్లు ఇస్తే భారీ జరిమానా'
telangana engineering admissions
Srilakshmi C
|

Updated on: Nov 06, 2022 | 5:58 PM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మెరిట్ లేని విద్యార్ధులకు బీ కేటగిరీ కింది అడ్మిషన్లు ఇస్తే ఒక్కోసీటుకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించనున్నట్లు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ శనివారం (నవంబర్‌ 5) హెచ్చరికలు జారీ చేసింది. మెరిట్‌ విద్యార్ధులను పక్కనపెట్టి ఇతర విద్యార్ధులకు సీట్లు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అలాగే ఇప్పటికే ప్రకటించిన ఫీజులకు బదులుగా అదనంగా ఫీజులు వసూలు చేస్తే విద్యార్ధికి రూ.2 లక్షల చొప్పు జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. కాగా ఫీజుల విషయమై అక్టోబరు 18వ తేదీన కాలేజీల పరంగా ట్యూషన్‌ ఫీజును నిర్ణయిస్తూ ప్రభుత్వం జీఓ 37ను జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా బీ కేటగిరీ సీట్లు కేటాయించడానికి తమ దరఖాస్తులను స్వీకరించడంలేదని కొందరు విద్యార్థులు టీఏఎఫ్‌ఆర్‌సీ ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నత విద్యామండలితో చర్చించి, ఆయా కాలేజీలకు అర్హుల జాబితాలను పంపించింది. మెరిట్‌ లేకుండా ప్రవేశాలు జరిగిన విద్యార్థులను తొలగించి ఆ స్థానంలో టీఏఎఫ్‌ఆర్‌సీ పంపిన జాబితా నుంచి ఎంపిక చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో మెరిట్‌ ప్రకారంగా సీట్లను భర్తీ చేశారో లేదో పరిశీలిస్తామని, అవకతవకలకు పాల్పడ్డారని తేలితే అలాంటి ఒక్కో సీటుకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్