AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO-CEPTAM Recruitment 2022: డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు రేపట్నుంచి ప్రారంభం.. అర్హతలేవంటే..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ - సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌లో 1061 స్టినోగ్రాఫర్‌ గ్రేడ్-I, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ..

DRDO-CEPTAM Recruitment 2022: డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు రేపట్నుంచి ప్రారంభం.. అర్హతలేవంటే..
DRDO Notification
Srilakshmi C
|

Updated on: Nov 06, 2022 | 4:10 PM

Share

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ – సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌లో 1061 స్టినోగ్రాఫర్‌ గ్రేడ్-I, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ రేపట్నుంచి (నవంబర్‌ 7) ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు డీఆర్డీఓ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే ఈ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, అండర్‌ గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లీష్/హిందీ టైపింగ్‌ స్కిల్స్‌ అవసరం. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే జనరల్‌ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.19,000ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

  • జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ పోస్టులు: 33
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I పోస్టులు: 215
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II పోస్టులు: 123
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(ఇంగ్లీష్ టైపింగ్) పోస్టులు: 250
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్) పోస్టులు: 12
  • స్టోర్ అసిస్టెంట్ (ఇంగ్లీష్ టైపింగ్) పోస్టులు: 134
  • స్టోర్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్) పోస్టులు: 4
  • సెక్యూరిటీ అసిస్టెంట్ ‘A’ పోస్టులు: 41
  • వెహికల్ ఆపరేటర్ పోస్టులు: 145
  • ఫైర్ ఇంజన్ డ్రైవర్ పోస్టులు: 18
  • ఫైర్ మ్యాన్ పోస్టులు: 86

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..