TGWDCW Hyderabad Recruitment 2022: డిగ్రీ/డిప్లొమా అర్హతతో.. హైదరాబాద్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు..
తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన హైదరాబాద్ జిల్లాలోని స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, శిశువిహార్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్.. ఒప్పంద ప్రాతిపదికన 10 మేనేజర్/ కోఆర్డినేటర్(ఎస్‌ఏఏ), సోషల్ వర్కర్(ఎస్‌ఎస్‌ఏ) తదితర..
తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన హైదరాబాద్ జిల్లాలోని స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, శిశువిహార్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్.. ఒప్పంద ప్రాతిపదికన 10 మేనేజర్/ కోఆర్డినేటర్(ఎస్‌ఏఏ), సోషల్ వర్కర్(ఎస్‌ఎస్‌ఏ), మహిళా నర్స్‌లు (ఎస్‌ఎస్‌ఏ), అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఐసీపీఎస్), చౌకీదార్ (ఎస్‌ఏఏ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఏఎన్‌ఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 19, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.7,800ల నుంచి రూ.22,750ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: The District Welfare Officer, WCD&SC, Hyderabad, Collectorate Premises, I Floor, Old Collectorate building, Namplly Station Road, Abids, Hyderabad 500 001.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.https://wdcw.tg.nic.in/
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.