TSPSC Group-1 Result date: పది రోజుల్లో తెలంగాణ టీఎస్పీయస్సీ గ్రూప్-1 ఫైనల్ ఆన్సర్ కీ.. ఫలితాలు ఎప్పుడంటే..
తెలంగాణ టీఎస్పీయస్సీ గ్రూప్-1 ప్రాథమిక ఆన్సర్ 'కీ'పై అభ్యంతరాల స్వీకరణ ముగిసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచిన గ్రూప్-1 ప్రాథమిక కీ ప్రకారం జవాబులను సరిచూసుకునేందుకు..
తెలంగాణ టీఎస్పీయస్సీ గ్రూప్-1 ప్రాథమిక ఆన్సర్ ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ ముగిసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచిన గ్రూప్-1 ప్రాథమిక కీ ప్రకారం జవాబులను సరిచూసుకునేందుకు దాదాపు1.44 లక్షల మంది అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు టీఎస్పీయస్సీ తెల్పింది. కాగా అక్టోబర్ 29న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ ఆన్సర్ ‘కీ’ని టీఎస్పీయస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రైమరీ ఆన్సర్ కీతోపాటు ఓఎంఆర్ షీట్ ఇమేజ్ స్కానింగ్‌లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 503 గ్రూప్-1 పోస్టులకు దాదాపు 3 లక్షల 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3 లక్షల 40 వేల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షకు 2 లక్షల 86 వేల 51 మంది హాజరయ్యారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలపై కమిటీ నిపుణుల పరిశీలన పూర్తయ్యాక పదిరోజుల్లో తుది ఆన్సర్ ‘కీ’ ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైన తర్వాత రెండు నెలల్లోపు ప్రిలిమినరీ పరీక్ష తుది ఫలితాలు విడుదల చేయనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.