JNTU Hyderabad: తెలంగాణ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్! గ్రేస్‌ మార్కులను పెంచిన జేఎన్టీయూహెచ్‌

బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులకు జేఎన్‌టీయూహెచ్ కీలక ప్రకటన చేసింది. 2018 బ్యాచ్‌కు సంబంధించిన విద్యార్ధుల్లో బ్యాక్‌లాగ్స్‌ ఉన్న వారు సబ్జెక్టు మినహాయింపు ఇవ్వాలని గత కొంతకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై విద్యార్ధులు..

JNTU Hyderabad: తెలంగాణ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్! గ్రేస్‌ మార్కులను పెంచిన జేఎన్టీయూహెచ్‌
JNTUH Increases grace marks for students
Follow us

|

Updated on: Nov 07, 2022 | 5:35 PM

బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులకు జేఎన్‌టీయూహెచ్ కీలక ప్రకటన చేసింది. 2018 బ్యాచ్‌కు సంబంధించిన విద్యార్ధుల్లో బ్యాక్‌లాగ్స్‌ ఉన్న వారు సబ్జెక్టు మినహాయింపు ఇవ్వాలని గత కొంతకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై విద్యార్ధులు తెలంగాణ ముఖ్యమంత్రి తమిళిసైని కలిసి వినతి పత్రాలు సైతం ఇచ్చారు. దీంతో గవర్నర్‌ రెండుసార్లు జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డిని పిలిపించి చర్చించారు. విద్యార్ధులకు ప్రయోజనకరంగా ఉండేలా తగిన నిర్ణయం తీసుకోవల్సిందిగా వీసీని ఆదేశించారు. దీంతో సబ్జెక్టు మినహాయింపుపై తాజాగా యూనివర్సిటీ అకడమిక్‌ సెనేట్‌, పాలకమండలి అధికారులతో చర్చించారు. ఇప్పటికే క్రెడిట్స్‌ను 160కు కుదించినందున సబ్జెక్టు మినహాయింపు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఐతే విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా గ్రేస్‌ మార్కులు పెంచాలని నిర్ణయించారు.

కాగా ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం బీటెక్‌ విద్యార్ధుల నాలుగేళ్ల చదువు పూర్తయ్యే నాటికి క్రెడిట్‌ పాయింట్లు152 నుంచి160 మధ్య క్రెడిట్స్‌ ఉంటే సరిపోతుంది. ఐతే జేఎన్‌టీయూహెచ్‌ మాత్రం 160 క్రెడిట్స్‌ ఉండాల్సిందేనని అంటోంది. సాధారణంగా ఇంజినీరింగ్‌లో రెండు బ్యాక్‌లాగ్స్‌ ఉన్న విద్యార్థులకు మొత్తం మార్కులపై 0.15శాతం అంటే 9 మార్కులు గ్రేస్‌గా ఇస్తుంటారు. ఐతే తాజా పరిస్థితుల దృష్ట్యా గ్రేస్‌ మార్కులను 0.25 శాతానికి పెంచి మొత్తం మార్కులతో కలపాలని నిర్ణయించినట్లు వీసీ వెల్లడించారు. అంటే దాదాపు15 మార్కులు గ్రేస్‌ మార్కులుగా కలుపుతారన్నమాట. గ్రేస్‌ మార్కుల పెంపు ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇక బ్యాక్‌లాగ్స్‌ ఉన్న విద్యార్థులకు డిసెంబరులోగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.