Repco Bank Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో క్లర్క్‌ ఉద్యోగాలకు రెప్కో బ్యాంక్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన రెప్కో బ్యాంక్‌.. 50 జూనియర్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Repco Bank Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో క్లర్క్‌ ఉద్యోగాలకు రెప్కో బ్యాంక్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే..
Repco Bank Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 07, 2022 | 4:40 PM

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన రెప్కో బ్యాంక్‌.. 50 జూనియర్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అక్టోబర్‌ 1, 1994 నుంచి సెప్టెంబర్‌ 30, 2001ల మధ్య జన్మించిన అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.900లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.17,900 నుంచి రూ.47,920ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు..

  • తమిళనాడు: 40
  • ఆంధ్రప్రదేశ్‌: 4
  • కేరళ: 2
  • కర్ణాటక: 4

రాత పరీక్ష విధానం..

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు 200 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.

  • రీజనింగ్‌ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
  • ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
  • జనరల్ అవేర్‌నెస్‌ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
  • కంప్యూటర్‌ నాలెడ్జ్‌ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.