AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఒకే ఒక్క ప్రశ్న.. సమాధానం చెప్పలేక బాబర్ బిత్తిరి చూపులు.. మర మనిషంటూ నెటిజన్ల కామెంట్స్..

PAK vs ENG Final: ఫైనల్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన్న పాకిస్తాన్ సారథి బాబర్ అజామ్‌.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక తెగ ఇబ్బంది పడ్డాడు. దీంతో నెటిజన్ల పాలిట ట్రోల్స్‌కు గురయ్యాడు.

Watch Video: ఒకే ఒక్క ప్రశ్న.. సమాధానం చెప్పలేక బాబర్ బిత్తిరి చూపులు.. మర మనిషంటూ నెటిజన్ల కామెంట్స్..
Pak Vs Eng Final Babar Azam
Venkata Chari
|

Updated on: Nov 12, 2022 | 3:38 PM

Share

టీ20 ప్రపంచ కప్ 2022 (T20 World Cup 2022), ఫైనల్ మ్యాచ్ రేపు పాకిస్తాన్-ఇంగ్లాండ్ (PAK vs ENG) మధ్య జరగనుంది. ఈ గ్రేట్ మ్యాచ్‌కి ఒకరోజు ముందు ఇరు జట్ల కెప్టెన్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే, అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. ఇక్కడ పాక్ కెప్టెన్ బాబర్ ఆజం విలేకరుల సమావేశంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.

విలేకరుల సమావేశంలో బాబర్ ఆజం విలేకరులకు సమాధానం ఇస్తుండగా, ఒక విలేఖరి ఐపీఎల్‌కు సంబంధించిన ప్రశ్న అడిగాడు. ‘ఐపీఎల్‌లో ఆడాలనే చర్చ జరిగింది. ఇది మీకు, మీ బృందానికి సహాయపడుతుందని మీరు భావిస్తున్నారా? భవిష్యత్తులో ఐపీఎల్‌లో ఆడాలని భావిస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే, ఆసక్తికర సమాధానం వస్తుందని అనుకున్న వారికి అంతకంటే ఎక్కువ మజానే అందించాడు. ఈ ప్రశ్నకు బాబర్ ఆజం ఎలాంటి సమాధానం చెప్పలేక తన మీడియా మేనేజర్ వైపు చూడటం మొదలుపెట్టాడు. బాబర్ బాధను అర్థం చేసుకున్న ఆయన రంగంలోకిదిగాడు. మీడియా మేనేజర్ మాట్లాడుతూ ప్రస్తుతానికి ప్రపంచకప్ ఫైనల్‌కు సంబంధించిన ప్రశ్నల గురించి మాత్రమే మాట్లాడతామని చెప్పుకొచ్చాడు.

బాబర్ వీడియో ఇక్కడ చూడండి..

ఐపీఎల్ 2008లో పాకిస్థానీ ఆటగాళ్లు..

ఐపీఎల్ మొదటి సీజన్‌లో పాక్ ఆటగాళ్లు పాల్గొన్నారు. IPL 2008లో షోయబ్ అక్తర్ నుంచి షాహిద్ అఫ్రిది వరకు చాలా మంది పాకిస్తానీ ఆటగాళ్లు భారత మైదానాల్లో కనిపించారు. అయితే ఆ తర్వాత, అదే ఏడాది ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడి తరువాత, భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి, భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. అలాగే ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లు కూడా ఆడడం లేదు.

ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిపై బాబర్ ఏం చెప్పాడంటే?

ఈ ప్రశ్నకు బాబర్ స్పందిస్తూ, ‘మా గత మూడు మ్యాచ్‌లలో మేం చాలా బాగా ఆడాం. మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఒత్తిడి ఉందనడంలో సందేహం లేదు. మాపై నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే ఒత్తిడిని అధిగమించగలం. మంచి ఫలితాల కోసం ఒత్తాడిని జయించడం ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..