AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Cricket: ఇప్పటి వరకూ భారత సారథికి దేశంలోని మాజీల విమర్శలే.. ఇప్పుడు దాయాది దేశం నుంచి కూడా..

సెమీఫైనల్‌లో భారత్ ఓడిన తీరుపై మాజీ క్రికెటర్ల నుంచి విమర్శల పరంపర కొనసాగుతోంది. అయితే ఇప్పుడు వారితో పాటు పాకిస్థాన్ నుంచి.. ఆ మాజీ బౌలర్

Indian Cricket: ఇప్పటి వరకూ భారత సారథికి దేశంలోని మాజీల విమర్శలే.. ఇప్పుడు దాయాది దేశం నుంచి కూడా..
Shoaib Akhtar, Rohit Sharma
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 12, 2022 | 11:23 AM

Share

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత జట్టు అత్యంత పేలవంగా ఆడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అది కూడా పది వికెట్ల తేడాతో ఓడిపోయి.. గ్రూప్ మ్యాచ్‌లలో అద్బుతంగా రాణించిన మన ఆటగాళ్లు అసలు మ్యాచ్‌లో బోర్లాపడ్డారు. దీంతో జట్టు సెమీఫైనల్‌లో ఓడిన తీరుపై భారత మాజీ క్రికెటర్ల నుంచి విమర్శల పరంపర కొనసాగుతోంది. అయితే ఇప్పుడు వారితో పాటు మన దాయాది దేశం అయిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ నుంచి కూడా అదే తరహా స్పందన వినిపిస్తోంది. ఆ బౌలర్ అయితే ఒక అడుగు ముందుకేసి.. అసలు రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాడా..? అతని పరిస్థితి అయోమయంగా ఉందని వ్యాఖ్యానించాడు.

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. ఆయన ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రపంచకప్‌ నుంచి భారత్ ఇంటికి రావడంపై స్పందించారు. అక్తర్ మాట్లాడుతూ..  ‘‘అసలు రోహిత్ శర్శ జట్టుకు సారథ్యం వహించడానికి  సిద్ధంగా ఉన్నాడా? ఆ ప్రశ్నకు నాకు సమాధానం దొరకడంలేదు. అతనికి కెప్టెన్‌గా కొనసాగలని ఉందని మనందరికీ తెలుసు. కానీ అది అనుకున్నంత తేలిక కాదు. జట్టు గురించే ఆలోచించాలి.. జీవించాలి. కుటుంబంతో కాలం గడపడానికి సమయం కూడా ఉండదు. అందుకే రోహిత్ తన సమయాన్ని జట్టు సభ్యులతో గడపాలి. తద్వారా జట్టును బలపరచగలడు. అతన్ని చూస్తుంటే కొంత అస్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు’’ అన్నాడు. అంతేకాక.. ‘‘జట్టు సారథిగా మారినప్పుడు అదనపు బాధ్యతలు కూడా వస్తాయి. జట్టు బాగా ఆడినప్పుడు అన్ని రకాల మన్ననలు కెప్టెన్‌కే వస్తాయి.. అలాగే ఓడిపోయినప్పుడు అందరూ సారథి వైపే వేళ్లు చూయిస్తారు. ఇక భారత్‌కు సారథిగా రోహిత్ కొగసాగడాన్ని నేను చూడలేను. అతను రిటర్మెంట్ ప్రకటించేందుకు దగ్గరలో ఉన్నాడు. విరాట్ కోహ్లీని కూడా సారథ్యం నుంచి తొలగించినప్పుడు అతను మెరుగైన ఆట ఆడటానికి కొంత సమయం తీసుకున్నాడు. అదృష్టవశాత్తు పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ మెరుపులు మెరిపించాడు. ఇక కెప్టెన్సీ విషయంలో రోహిత్‌తో చర్చించడం కూడా చాలా ఎక్కువే..!’’ అని ఆయన అన్నాడు.

ప్రపంచకప్ టోర్నమెంట్ గ్రూప్ దశలో మన జట్టు తన మొదటి రెండు మ్యాచ్‌లను అద్భుతంగా ఆడింది. దక్షినాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో వెనకడుగు వెసినా మిగిలిన రెండు ఆటల్లోనూ విజయం సాధించింది. అంతే కాక గ్రూప్ టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత గురువారం అడిలైడ్‌లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో.. దారుణంగా విఫలమై ఐఐసీ టోర్నమెంట్ నుంచి బయటకు వచ్చింది. ఆ మ్యాచ్‌లో మన ఆటగాళ్లు ఆడిన తీరుపై సర్వత్రా చర్చనియాంశమయింది. గురువారం భారత జట్టు మాజీ సారథులు కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్ నోరు విప్పగా.. శుక్రవారం డాషింగ్ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్ రోహిత్ శర్మపై నిప్పులు చెరిగాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..