AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Cricket: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమణతో గుర్రుమంటున్న మాజీలు.. తాజాగా ఆ డాషింగ్ ఓపెనర్ కూడా ఫైర్..

ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్‌లో భారత్ గెలవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ కోరుకున్నారు. కానీ ఫైనల్ సంగతి దేవుడెరుగు.. ముందు సెమీ ఫైనల్ గెలిస్తే కదా అన్నట్లుగా అత్యంత దారుణంగా.. మన ఆటగాళ్లు

Indian Cricket: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమణతో గుర్రుమంటున్న మాజీలు.. తాజాగా  ఆ డాషింగ్ ఓపెనర్ కూడా ఫైర్..
Virendra Sehwag On T20 Worl
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 11, 2022 | 6:08 PM

Share

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ గెలుస్తుంది.. అంతకు ముందే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న దాయాది పాక్‌తో తలపడుతుంది.. ప్రపంచకప్ కోసం హోరాహోరీగా జరిగే మైదాన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధిస్తుంది.. ఇది కదా అసలు సిసలు క్రికెట్ మ్యాచ్ అంటే.. ఇక అదివారం పండగే పండగ అని భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ కోరుకున్నారు. వారంతా  ఈ  మ్యాచ్‌ మీద ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు అంటే అది అతిశయోక్తి  కాదేమో ! కానీ జరిగినది చూస్తే ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఫైనల్‌లో భారత్ గెలుపు సంగతి దేవుడెరుగు.. ముందు సెమీ ఫైనల్ గెలిస్తే కదా అన్నట్లుగా అత్యంత దారుణంగా విఫలమయ్యారు. ఎవరికీ అర్థం కాని విషయం ఏమిటంటే అప్పటి వరకూ జరిగిన అన్ని మ్యాచ్‌లలో..  అద్భుత ఫామ్‌ను కనబర్చిన భారత జట్టు మాజీ కెప్టెన్  విరాట్ కోహ్లీ, ‘మిస్టర్ 360’ సూర్య కుమార్ యాదవ్ కూడా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో చేతులెత్తేశారు. జట్టుకు అవసరమైన మ్యాచ్‌లో కాకుండా గ్రూప్ లెవల్‌లో ఆడి ఏం లాభమని క్రికెట్ అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు మాజీ దిగ్గజ క్రికెటర్లు కూడా  ఒకరి తర్వాత మరొకరు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ముందుగా భారత  మాజీ కెప్టెన్‌లు కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్.. తాజాగా మాజీ క్రికెట్ లెజెండ్, డాషింగ్ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్ పెదవి విప్పి, తనలోని ఉక్రోశాన్ని వ్యక్తపరిచారు.

తమలోని లోపాన్ని కప్పిపుచ్చుకుంటూ  బౌలర్లు విఫలమయ్యారని జట్టు సారథి రోహిత్ శర్మ అనడం సబబు కాదని.. ముందుగా వచ్చినవాళ్లు పది  ఓవర్లలోనే కనీసం 80 పరుగులు చేసి ఉండవలసిందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ‘‘టాప్ ఆర్డర్ ఆటగాళ్లు మొదటి 12 ఓవర్లలో 82 పరుగులే చేసి ఉన్నా.. తర్వాత వచ్చిన ఆటగాళ్లు ధైర్యంగా ఆడగలిగేవారు. ఎనిమిది ఓవర్లలో వంద పరుగులు చేయగల ఆటగాళ్లు మీరు. కానీ అది అన్ని సందర్భాలలో  కలిసి రాదు. అవును నిజమే.. గతంలో వాంఖడే, ఫిరోజ్ షా కోట్లా వంటి మైదానాలలో మీరు ఎన్నో సార్లు చేసి చూపారు. ఆస్ట్రేలియాపై  న్యూజిలాండ్ కూడా తన మొదటి ఆటను అలాగే ఆడి గెలిచింది. కానీ తన సెమీ ఫైనల్‌లో అలా గెలవలేకపోయింది ఆ జట్టు. భారత జట్టులోని బ్యాటర్లు అంతా తాము బాగానే ఆడాము, బౌలర్లే విఫలమయ్యారని అంటే నేను ఒప్పుకోను. నిజానికి అందరూ కోరుకున్నట్లుగా  మన జట్టు బ్యాటింగ్‌ను ప్రారంభించలేక మొదటి పది ఓవర్లలోనే ఓడిపోయిందని చెప్పుకోవాలి’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.

అయితే సెహ్వాగ్ కన్నా ముందుగానే.. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ ఓటమిపై మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్ స్పందించారు. ‘‘ప్రపంచ కప్‌లో ఒక్క మ్యాచ్ ఓడిపోయారని బాధపడవలసిన అవసరం లేదు. నిజమే సెమీఫైనల్‌లో అత్యంత పేలవ ప్రదర్శన ఇచ్చారు. కానీ ఆ జట్టులోని ఆటగాళ్లే ఎన్నో సార్లు మ్యాచ్‌ను గెలిపించారు. అనేక సిరీస్‌లు గెలుచుకు వచ్చారు’’ అని గురువారం రాత్రి కపిల్ దేవ్ అన్నారు. ‘‘ కేవలం ఒక టోర్నమెంట్ సెమీఫైనల్‌లో ఓడిపోయినంత మాత్రానే జట్టులోని ఆటగాళ్లను నిందించాల్సిన అవసరం లేదు.  ఎంతో టాలెంట్ ఉన్న చురుకైన ఆటగాళ్లు ఇప్పుడు  జట్టులో ఉన్నారు. వచ్చే సెమీ ఫైనల్‌ గురించి, ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడుకోవడానికి ఇంకా రెండు  సంవత్సరాల సమయం ఉంది’’ అని రాహుల్ ద్రావిడ్  భారత ఆటగాళ్లకు తన మద్దతు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

కాగా, గురువారం ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ..  మేము ఆడిన విధానం మమ్మల్ని ఎంతగానో నిరాశపరిచింది. బ్యాట్ మెన్ బాగానే ఆడారు కానీ బైలర్లు దారుణంగా నిరుత్సాహపరిచారని నా అభిప్రాయం.అడిలైడ్  ఓవెల్ పిచ్ 16 ఓవర్ల ఆటలో ఒక్క వికెట్ కూడా పడకుండా బ్యాటింగ్ అనుకూలించేది అయితే కాదు. సెమీ ఫైనల్ అనేసరికి మా అందరిపై ఒత్తిడి పెరిగింది. దానిని ఎలా అధిగమించాలో ఎవరూ నేర్పలేర’’ అని అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..