Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gurugram Toll Plaza: టోల్ ప్లాజా వద్ద వీరంగం.. కారులోంచి బ్యాట్ తీసుకుని సిబ్బందిపై, 17 టోల్ బూత్‌లపై..

టోల్ ప్లాజాలో డబ్బులు చెల్లించడం చూసే ఉంటారు కదా.. అక్కడ క్యూ ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు ? కదలకుండా కూర్చుని వేచి ఉంటారు ఎవరైనా. కానీ హర్యానాలో ఓ ప్రబుద్ధుడు చాలా వింతగా..

Gurugram Toll Plaza: టోల్ ప్లాజా వద్ద వీరంగం.. కారులోంచి బ్యాట్ తీసుకుని సిబ్బందిపై, 17 టోల్ బూత్‌లపై..
Gurugram Toll Plaza
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 11, 2022 | 1:25 PM

రహదారులపై కారు,బస్సు ప్రయాణాలు చేసేటప్పుడు టోల్ ప్లాజాలో డబ్బులు చెల్లించడం చూసే ఉంటారు కదా.. అలాంటి సమయంలో అక్కడ క్యూ ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు ? కదలకుండా సీటులోనే కూర్చుని వేచి ఉంటారు ఎవరైనా. కానీ హర్యానాలో ఓ ప్రబుద్ధుడు చాలా వింతగా ప్రవర్తించాడు. అంతేనా విధ్వంసం సృష్టించాడు. అక్కడ పనిచేసే  సిబ్బంది పైన కూడా దాడి చేశాడు.  దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. గురుగ్రామ్ బ్లాక్ కమిటీ మాజీ చైర్మన్ హోషియార్ సింగ్(46) హర్యానాలోని గురుగ్రామ్‌కు దగ్గరలోని నౌరంగ్పూర్ ప్లాజా పరిసరాల్లో నివసిస్తున్నాడు. ఎప్పటిలాగానే ఈ బుధవారం ఉదయం 10 గంటలకు టోల్ ప్లాజా పదో లైన్‌ దాటుతున్న సమయంలో అక్కడ ఉన్న క్యూ ఉండిపోయాడు. అతనికి ముందు క్యూలో ఒక వ్యాన్ ఆగి ఉంది. వ్యాన్ డ్రైవర్ టోల్ చెల్లిస్తున్నప్పుడు టెక్నికల్ సమస్యలతో ఆలస్యమయింది. ఆలస్యం అవుతుండడంతో హోషియార్ సింగ్ ఉగ్రరూపం దాల్చి, కారు నుంచి బయటకు దిగాడు. అక్కడితో ఆగకుండా కారులో నుంచి ఒక బ్యాట్‌ను బయటకు తీసి దానితో అక్కడి సిబ్బందిపై దాడికి దిగాడు. అంతేనా.. టోల్ ప్లాజా లైన్లలోని గదుల అద్దాలను ఒక దాని తర్వాత మరొకటి పగులకొడతూ వెళ్లాడు. ఇదంతా అక్కడ  ఉన్న సీసీ కెమెరాలలో రికార్టు అయి, ఆ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘‘నిందితుడు హోషియార్ సింగ్ కారుకు ముందు ఉన్న వ్యాన్ డ్రైవర్ ఆటోమేటిక్ ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించలేకపోయాడు. అందువల్ల అతని నుంచి కాష్ రూపంలో టోల్ తీసుకుంటున్న సమయంలో కొంత సమయం పట్టింది. ఇంతలో నిందితుడు కారులో నుంచి క్రికెట్ బ్యాట్‌తో బయటకు వచ్చి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసి, అన్ని లైన్లలోని గదుల అద్దాలను పగులకొట్టాడు. వెంటనే మేము కమిషనర్ ఆఫీస్‌కు సమాచారం అందించగా వారు ప్లాజా వద్దకు వచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు వచ్చే లోపే అతను 17 టోల్ బూత్‌లను ధ్వంసం చేసి, దాదాపు 12 మంది సిబ్బందిని గాయపరిచాడు’’ అని ప్లాజా సీనియర్ అధికారి విజేందర్ సింగ్ తెలిపారు. హోషియార్ సింగ్‌పై గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు నమోదయ్యాయని ప్లాజా సిబ్బంది పేర్కొన్నారు.

‘‘టోల్ ప్లాజా సిబ్బంది అందించిన సమాచారం మేరకు ప్లాజా వద్దకు చేరుకొని నిందితుడిని విచారించాం. ప్లాజా అధికారుల ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి ఐపీసీ 323, 427, 506 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామ’’ని ఖేర్కీ దౌలా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ సింగ్ తెలిపారు. ఈ ప్లాజా ద్వారా ప్రతిరోజు దాదాపు 90 వేల వాహనాలు వెళ్తుంటాయని.. తద్వారా 60 లక్షల వరకూ ఆదాయం వస్తుందని ఇన్‌స్పెక్టర్ అన్నారు. అంతేకాక చుట్టుపక్కల 31 గ్రామలలోని ప్రజల వాహనాలకు టోల్ మినహాయింపు అమలుచేస్తున్నారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..