నదిలో తేలియాడుతూ కనిపించిన జిలెటిన్ స్టిక్స్.. రంగంలోకి దిగిన యాంటీ బాంబ్ స్క్వాడ్..! ఏం జరిగిందంటే..!
పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. దీని వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లోని పెన్‌లోని భాగావతి నదిలో తేలుతున్న జిలెటిన్ స్టిక్‌లను యాంటీ బాంబ్ స్క్వాడ్ తొలగించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే, పెన్ పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే యాంటీ బాంబ్ స్క్వాడ్‌ను పిలిచి నది నుండి జిలెటిన్ స్టిక్స్‌ను బయటకు తీశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రహదారిని దిగ్బంధించారు. సాయంత్రం వరకు నదిలో ఉన్న జిలెటిన్ స్టిక్స్‌ని పోలీసుల బృందం పరిశీలించింది. అయితే, ఇక్కడికి ఇవి ఎలా వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు.
పోలీసు సూపరింటెండెంట్ (SP) సోమనాథ్ ఘర్గే ప్రకారం, స్వాధీనం చేసుకున్న వస్తువు ఒక రకమైన డమ్మీ బాంబు అని, ఈ సంఘటన వెనుక బాధ్యులైన వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. నదిపై బాంబు లాంటి వస్తువు తేలుతున్నట్లు మాకు సమాచారం అందిందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దానిని స్కాన్ చేసింది. ఇది ఒక విధమైన డమ్మీ బాంబు అని తేల్చారు.
#WATCH | Raigarh, Maharashtra: Anti-bomb squad disarms gelatin sticks found floating on the Bhogavati river of Penn (10.11) pic.twitter.com/Mpkww7Y8tZ
— ANI (@ANI) November 10, 2022
పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. దీని వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రహదారిని దిగ్భందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి