Twitter: అందుబాటులోకి ట్విట్టర్ బ్లూటిక్ సేవలు.. భారత్‌లో ధర ఎంతంటే..
ఎలన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్య బాధ్యతలు సొంతం చేసుకున్నప్పటికి నుంచి సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ బ్లూటిక్ వెరిఫికేషన్ సేవలను అందుబాటులోకి..
ఎలన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్య బాధ్యతలు సొంతం చేసుకున్నప్పటికి నుంచి సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ బ్లూటిక్ వెరిఫికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం పలు దేశాల్లో ఈ సర్వీసు అందుబాటులోకి రాగా.. త్వరలోనే ట్విట్టర్ బ్లూటిక్ సేవలను ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సేవలను పొందాలనుకునే వారు నెలకు 8.99 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. భారత్ లో ఈ ధర ఎంత ఉంటుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ధర ఉంటుందని ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ గతంలో వెల్లడించారు. దీంతో భారత్‌లో తక్కువ ధర ఉండొచ్చని అంచనా వేశారు. కాని అంచనాలను తారుమారు చేస్తూ.. అమెరికా కంటే భారత్‌లోనే ధర ఎక్కువుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఈ సేవల ధర రూ.719గా ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రాంప్ట్స్ పొందినట్లు కొంత మంది వినియోగదారులు స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. అమెరికాలో ధర కన్నా ఎక్కువ కావడంతో ట్విట్టర్ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సర్వీస్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ బ్లూటిక్ కు సభ్యత్వం పొందిన వారు ఎలాంటి ధృవీకరణ లేకుండానే బ్లూ టిక్ పొందనున్నారు. దీనికోసం రుసుము వసూలు చేసి ఆదాయాన్ని పొందాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను అందరికీ వర్తింపజేయనున్నారు. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ట్విట్టర్ యాజమాన్యం ఈ తరహ చర్యలను చేపడుతోంది.
అ ప్రస్తుతానికి ఐఓఎస్ (ఐఫోన్) యూజర్లకు మాత్రమే ట్విట్టర్ బ్లూటిక్ సేవలకు సంబంధించిన మెసేజ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అందరికీ ఈ ఛార్జీలను అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ మెసేజ్‌లు వచ్చిన యూజర్లు కొందరు వాటిని స్క్రీన్‌షాట్లు తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు. వీటిలో నెలవారీ ఛార్జీ రూ.719గా కన్పిస్తోంది. బ్లూటిక్ కొనసాగించుకోవాలంటే ఖాతాదారులు ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వద్దనుకుంటే ఈ ఫీచర్‌ను రద్దు చేసుకోవచ్చు.
మరోవైపు ఈసేవలను ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా ఇవ్వడం వల్ల నకిలీ ఖాతాలు పెరిగే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు ముఖ్య వ్యక్తులను గుర్తించేందుకు అధికారిక గుర్తును ట్విటర్ తీసుకొచ్చింది. అయితే, ఈ గుర్తు చాలా మంది ప్రభుత్వేతర వ్యక్తుల ఖాతాల్లోనూ కనిపించడంతో గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని గంటల్లోనే అధికారిక గుర్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విటర్ ప్రకటించింది.
Some people in India have started receiving Twitter Blue access at ₹719 per month ($8.88 to be exact lol) pic.twitter.com/olgjWAkaix
— Trendulkar (@Trendulkar) November 10, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..