AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank News: మీ అకౌంట్‌ను వేరే బ్రాంచ్‌కు మార్చుకోవాలా.? బ్యాంకుకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే ఇలా చేసుకోవచ్చు..

రకరకాల కారణాలతో చాలా మంది తమ బ్యాంక్‌ అకౌంట్‌ను ఒక బ్రాంచ్‌ నుంచి మరో బ్రాంచ్‌కు మార్చుకుంటుంటారు. ముఖ్యంగా ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రాన్స్‌ఫర్‌ అయిన వారు ఖాతాను తామకు నచ్చిన బ్రాంచ్‌కు మార్చుకోవాలనుకుంటారు. అయితే ఇందుకోసం బ్యాంకుకు వెళ్లి..

Bank News: మీ అకౌంట్‌ను వేరే బ్రాంచ్‌కు మార్చుకోవాలా.? బ్యాంకుకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే ఇలా చేసుకోవచ్చు..
Bank News
Narender Vaitla
|

Updated on: Nov 11, 2022 | 5:20 PM

Share

రకరకాల కారణాలతో చాలా మంది తమ బ్యాంక్‌ అకౌంట్‌ను ఒక బ్రాంచ్‌ నుంచి మరో బ్రాంచ్‌కు మార్చుకుంటుంటారు. ముఖ్యంగా ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రాన్స్‌ఫర్‌ అయిన వారు ఖాతాను తామకు నచ్చిన బ్రాంచ్‌కు మార్చుకోవాలనుకుంటారు. అయితే ఇందుకోసం బ్యాంకుకు వెళ్లి, అప్లికేషన్‌ ఫామ్‌ను నింపి పెద్ద పనే ఉంటుంది. కానీ అలా కాకుండా ఇంట్లోనే ఉంటూ, గడప కూడా అడుగు పెట్టకుండా ఆన్‌లైన్‌లో ఈ పని చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ.! మీలాంటి వారి కోసమే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గొప్ప అవకాశం తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో సింపుల్‌ స్టెప్స్‌ ద్వారా బ్రాంచ్‌ను మార్చుకోవచ్చు. ఇంతకీ ఆ స్టెప్స్‌ ఏంటంటే..

* ఇందుకోసం ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ ‘www.onlinesbi.com’లోకి వెళ్లాలి.

* అనంతరం ‘పర్సనల్‌ బ్యాంకింగ్‌’ క్లిక్‌ చేసి పాస్‌వర్డ్‌, యూజర్‌నేమ్‌తో లాగిన్‌ కావాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం ‘ఈ-సర్వీస్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత అందులో ఉండే ‘ట్రాన్సఫర్‌ ఆఫ్‌ సేవింగ్స్‌ అకౌంట్‌’పై క్లిక్‌ చేయాలి.

* వెంటనే ఎస్‌బీఐలో మీకున్న అకౌంట్‌ జాబితా వస్తుంది. బ్రాంచ్‌ మార్చుకోవాలనుకుంటున్న అకౌంట్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

* ఆ తర్వాత మీరు ఏ బ్రాంచ్‌కు మార్చుకోవాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్‌ పేరు టైప్‌ చేసి సెలక్ట్ చేసుకోవాలి.

* తర్వాత చివరల్లో కనిపించే సబ్‌మిట్ బటన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే పాత బ్రాంచ్‌ కోడ్‌, కొత్త బ్రాంచ్‌ కోడ్‌ను ఎంటర్‌ చేసి వెరిఫై చేయాలి.

* కాన్ఫామ్‌ బటన్‌ను నొక్కగానే ఓటీపీ వస్తుంది. అనంతరం ఆ ఓటీపీని ఎంటర్‌ చేసి కాన్ఫామ్‌ కొట్టాలి.

* దీంతో చివరల్లో మీ బ్యాంక్‌ బ్రాంచ్‌ విజయవంతంగా మారినట్లు మెసేజ్‌ చూపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?