కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ మూడు ప్రభుత్వ కంపెనీల్లోని వాటాల విక్రయానికి గ్రీన్‌ సిగ్నల్‌

ఎట్టకేలకు మూడు ప్రభుత్వ కంపెనీల్లో వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల..

కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ మూడు ప్రభుత్వ కంపెనీల్లోని వాటాల విక్రయానికి గ్రీన్‌ సిగ్నల్‌
Public Sector Companies
Follow us

|

Updated on: Nov 11, 2022 | 1:24 PM

ఎట్టకేలకు మూడు ప్రభుత్వ కంపెనీల్లో వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానం కొనసాగుతుందనడానికి ఇవి స్పష్టమైన సంకేతాలు. ఈ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో షేర్ల విక్రయం ప్రయోగాన్ని అమలు చేయనున్నారు. ఈ మూడు పెద్ద ప్రభుత్వ కంపెనీలను మార్చి, 2023 నాటికి ఉపసంహరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ కంపెనీల్లో ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఐదు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

ప్రభుత్వ నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా, హిందుస్థాన్ జింక్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (ఆర్‌ఐటీఈఎస్‌) షేర్లను విక్రయించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ స్థాయిలో ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ప్రతిపాదనకు సంబంధించి కంపెనీ రెగ్యులేటర్ నుండి ఇంకా ఆమోదం రాలేదు. ఈ ఆమోదం లభించిన తర్వాత తదుపరి అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విక్రయం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.24,000 కోట్లు వసూలు చేసింది.

ఇప్పుడు, కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం రాబోయే ఐదు నెలల్లో మూడు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలను విక్రయించడం ద్వారా మరిన్ని నిధులను సమీకరించనుంది. దీని ద్వారా రూ.18,000 నుంచి 20,000 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కోల్ ఇండియాలో ప్రభుత్వం 3 శాతం వాటాను విక్రయించనుంది. 5,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హిందుస్థాన్ జింక్‌లో 8% వాటాను విక్రయించడం ద్వారా రూ. 10,000 కోట్లు, ఆర్‌ఐటీఈఎస్‌ లో 10% వాటాలను విక్రయించడం ద్వారా రూ. 1,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..