Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అదిరిపోయే బైక్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు

క్లాసిక్ బైక్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇటలీలోని మిలన్‌లో జరిగిన 2022 EICMA (ఇంటర్నేషనల్ మోటార్‌సైకిల్, యాక్సెసరీస్ ..

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అదిరిపోయే బైక్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు
Royal Enfield Super Meteor 650
Follow us
Subhash Goud

|

Updated on: Nov 11, 2022 | 1:03 PM

క్లాసిక్ బైక్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇటలీలోని మిలన్‌లో జరిగిన 2022 EICMA (ఇంటర్నేషనల్ మోటార్‌సైకిల్, యాక్సెసరీస్ ఎగ్జిబిషన్)లో కొత్త సూపర్ మీటోర్ 650 బైక్‌ను ఆవిష్కరించింది. కొత్త సూపర్‌ మీటోర్‌ 650 క్రూయిజర్ బైక్ మోడల్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ భారతదేశంలోనే కాకుండా ప్రధాన అంతర్జాతీయ మార్కెట్‌లలో కూడా పరిచయం చేస్తుంది.

ఇంజిన్ పనితీరు

కొత్త సూపర్ మెటోర్ 650 క్రూయిజర్ బైక్ 648 cc సమాంతర-ట్విన్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 46.3 bhp, 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త బైక్‌లో 43 mm అప్ సైడ్ డౌన్ ఫోర్క్, 120 mm ఫ్రంట్ ట్రావెల్ ట్విన్ షాక్, వెనుకవైపు 101 mm ట్రావెల్ సస్పెన్షన్‌తో కొత్త స్ట్రీల్ ట్యూబ్యులర్ స్పైన్ ఫ్రేమ్ ఉంది.

ఇంధన ట్యాంక్ కెపాసిటి:

సూపర్ మెటోర్ 650 బైక్ మోడల్ ముఖ్యంగా క్రూయిజర్ బైక్ ప్రియుల కోసం రూపొందించబడింది. కొత్త మోడల్ పొడవు 2,260 మిమీ, వెడల్పు 890 మిమీ, ఎత్తు 1,155 మిమీ, సీట్ ఎత్తు 740 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్‌లో 135 మిమీ. దీనితో పాటు కొత్త బైక్‌లో 15.7 లీటర్ కెపాసిటి గల ఇంధన ట్యాంక్, కొత్త బైక్ మొత్తం 241 కిలోల బరువు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

డిజైన్, ఫీచర్లు

650 ట్విన్ బైక్ మోడళ్లతో పాటు స్టాండర్డ్ మెటోర్ ఆధారంగా కొత్త బైక్ మోడల్ అద్భుతమైన డిజైన్‌ను పొందింది కంపెనీ. స్పాటీ ఎల్‌ఈడీ లైటింగ్‌లు కొత్త బైక్‌కు ప్రధాన ఆకర్షణ. అంతే కాకుండా క్లాసిక్ స్టైలిష్ లుక్‌తో కూడిన హెడ్ ల్యాంప్స్, వైడ్ హ్యాండిల్ బార్, టియర్ డ్రాప్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, ఫీట్ ఫార్వర్డ్ ఫుట్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

కొత్త సూపర్ మెటోర్ 650 బైక్ మోడల్ భద్రతకు కూడా చాలా ప్రాధాన్యతనిచ్చింది కంపెనీ. ముందు చక్రం వద్ద 320 మిమీ డిస్క్ బ్రేక్, రెండు పిస్టన్ కాలిపర్ సౌకర్యాలతో పాటు 300 మిమీ వెనుక డిస్క్ బ్రేక్ సౌకర్యం ఉంది. అలాగే కొత్త బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌, 19 అంగుళాల ఫ్రంట్ వీల్‌తో 100/90 -19M/C 57H ట్యూబ్‌లెస్ టైర్, 16 అంగుళాల వెనుక చక్రం 150/80 B16 M/C 71H ట్యూబ్‌లెస్ టైర్‌తో అమర్చబడి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి