Ginger Purity: మార్కెట్లో నకిలీ అల్లం వ్యాపారం.. ఫేక్‌ అల్లాన్ని గుర్తించడం ఎలా..?

అల్లం.. దీనిని వంటకాల్లోనే కాకుండా వివిధ ఔషధాలకు ఉపయోగిస్తుంటారు. అల్లంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అల్లం లేకుండా టీ అసంపూర్ణంగా..

Ginger Purity: మార్కెట్లో నకిలీ అల్లం వ్యాపారం.. ఫేక్‌ అల్లాన్ని గుర్తించడం ఎలా..?
Fake Ginger
Follow us
Subhash Goud

|

Updated on: Nov 11, 2022 | 1:52 PM

అల్లం.. దీనిని వంటకాల్లోనే కాకుండా వివిధ ఔషధాలకు ఉపయోగిస్తుంటారు. అల్లంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అల్లం లేకుండా టీ అసంపూర్ణంగా ఉంటుంది. అల్లం వేయకపోతే టీ రుచి పాడైపోతుంది. టీతో పాటు, అల్లం అనేక ఇతర ఆహార పదార్థాల రుచిని కూడా పెంచుతుంది. అయితే ఈరోజుల్లో నకిలీ అల్లం వ్యాపారం మార్కెట్‌లో జోరుగా సాగుతోంది. అది ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. లాభాల కోసం మార్కెట్‌లో నిజమే అనిపించే అల్లం అమ్ముతున్నారు. నకిలీ, నిజమైన అల్లం మధ్య తేడాను గుర్తించడం కష్టం. అయితే మనం కొన్ని చిట్కాల ద్వారా సరైన అల్లంను గుర్తించవచ్చు. మీరు నకిలీ, నిజమైన అల్లాన్ని ఎలా గుర్తించవచ్చో తెలుసుకోండి.

నకిలీ అల్లం అంటే ఏమిటి

నిజమైన అల్లంలా కనిపించే ఈ అల్లం లాంటిది కొండ చెట్టులో కనిపిస్తుంది. నకిలీ అల్లం తహార్ అనే చెట్టులో ఒక భాగం. ఇది ఎండినప్పుడు నిజమైన అల్లం వలె కనిపిస్తుంది. తహార్‌ను ఎండబెట్టి నిజమైన అల్లంతో కలిపి మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు.

ఎలా గుర్తించాలి?

అల్లం అతిపెద్ద గుర్తింపు దాని సువాసన. ఇది నకిలీదో కాదో తెలుసుకోవడానికి అల్లం వాసన చూడండి. అల్లం వాసన రాకపోతే అది నకిలీ కావచ్చు. అల్లం భూమి కింద పెరిగే ఒక వేరు. దీనివల్ల అల్లంలో కొంత మట్టి మిగిలిపోతుంది. అల్లం చాలా శుభ్రంగా కనిపిస్తే దానిపై మట్టి జాడ లేకుండా, వాసన లేకుండా ఉంటే అది ఖచ్చితంగా నకిలీ అల్లం అనే గుర్తించాలి. అల్లం ఆరోగ్యకరమైనది. అలాగే ఆహార పదార్థాల రుచిని పెంచుతుంది. అల్లం కొనడానికి ముందు, ఖచ్చితంగా రుచి చూడండి. నిజమైన అల్లం రుచి గుర్తించదగినదిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అలాగే మీరు మార్కెట్ నుండి అల్లం కొనడానికి వెళ్ళినప్పుడు అల్లంను మీరే క్షుణ్ణంగా పరిశీలించండి. అల్లం కొనుగోలు చేసేటప్పుడు అల్లం పై పొర సన్నగా ఉండాలని గుర్తుంచుకోండి. మీ గోర్లతో అల్లంపై నొక్కినట్లయితే పైపొర కత్తిరించేలా పైకి రావాలి. ఇప్పుడు దాని వాసన ఉందా లేదా అని పరీక్షించండి. సువాసన ఘాటుగా ఉంటే అల్లం నిజమైనది. లేకపోతే అది నకిలీ అల్లమని గుర్తించుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే