- Telugu News Photo Gallery Avoid Disclosure Of Your Aadhaar Informations On Social Media Twitter Instagram, Facebook
Social Media: సోషల్ మీడియా వినియోగదారులకు యూఐడీఏఐ హెచ్చరిక.. ఈ తప్పులు చేసినట్లయితే ఇక అంతే సంగతి!
ఈరోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని చాలా విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు..
Updated on: Nov 11, 2022 | 8:32 AM

ఈరోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని చాలా విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇందులో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన సలహాలు ఇచ్చింది.

సోషల్ మీడియా వినియోగదారులు తమ ఆధార్ సమాచారాన్ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మొదలైన వాటిలో షేర్ చేయకూడదని ఆధార్ అప్‌డేట్ సంస్థ యూఐడీఏఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

గత కొన్ని నెలలుగా ఆధార్ సంబంధిత మోసాలపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అందుకే ఆధార్ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని పేర్కొంది.

భారతదేశంలో చాలా ప్రభుత్వ సౌకర్యాలను పొందడానికి ఆధార్ కార్డ్ ఒక సులభమైన మార్గం. ఇది ఒక ప్రత్యేక ఐడీ నంబర్ కలిగి ఉంటుంది.

బ్యాంకు ఖాతా తెరవడం నుంచి మొబైల్ సిమ్ కొనుగోలు వరకు ఆధార్ కార్డు తప్పనిసరి అవసరమే. కానీ సోషల్ మీడియాలో ఆధార్ కార్డును షేర్ చేయడం వల్ల మోసం జరుగుతుంది. దీని వల్ల మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావడంతో పాటు వ్యక్తిగత వివరాలు తెలుసుకుని మిమ్మల్ని మోసగించేందుకు ఆస్కారం ఉంటుంది.





























