- Telugu News Photo Gallery How to Improve Memory Power: Practice these tips to boost your memory power
Memory Power Tips: చదువుకునే పిల్లల్లో జ్ఞాపక శక్తి మెరుగుపడాలంటే.. రోజూ ఇలా చేయాలి..
డార్క్ చాక్లెట్లను 70 శాతం కోకోతో తయారు చేస్తారు. చక్కెర ఉండదు. అలాగే కోకోలో ఫ్లేవనాయిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు..
Updated on: Nov 10, 2022 | 9:40 PM

డార్క్ చాక్లెట్లను 70 శాతం కోకోతో తయారు చేస్తారు. చక్కెర ఉండదు. అలాగే కోకోలో ఫ్లేవనాయిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు.

పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, జీడిపప్పు వంటి విత్తనాల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

జ్ఞాపకశక్తి పెంపొందించుకోవాలంటే చక్కెర తినడం తగ్గించుకోవాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ చక్కెర తీసుకుంటే మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి పంచదారకు బదులు బెల్లం, ఖర్జూరం, తేనె ఉపయోగించడం బెటర్.

సుడోకు, చెస్, క్రాస్‌వర్డ్, పజిల్ గేమ్ వంటి ఆటలు అభిజ్ఞా సామర్థ్యాలను పెంపొందించడంలో సహాయపడతాయి.

విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాన్ని తిసుకోవాలి. అంటే బీట్‌రూట్, క్యారెట్ వంటి ఆహారాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

ఫిష్ ఆయిల్ జ్ఞాపకశక్తిని పెంచడానికి అద్భుతమైన ఔషదం. దీనిలో అధిక మొత్తంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. మెదడు కణాలను పునరుద్ధరించడంలో ఇది ఉపయోగపడుతుంది.

జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచడానికి అద్భుతమైన మార్గం.. ప్రతి రోజూ ధ్యానం చేయడం.





























