వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మందికి వానలో తడవడం చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ఎక్కువగా వర్షంలో తడుస్తారు.
వర్షాకాలం
అయితే కొంత మందికి వర్షంలో తడవడం ఇష్టం ఉన్నా సరే, వాళ్ల పేరెంట్స్ తడవనివ్వరు, వానలో తడిస్తే జలుబు దగ్గు వస్తుందని చెప్పుకొస్తుంటారు.
వర్షంలో తడవడం
మరి అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వర్షంలో తడిస్తే జలుబు ఎందుకు అవుతుంది. దీనికి గల కారణాలు ఏంటో?
జలుబు వర్షం
చాలా మంది వర్షంలో తడవడం వలన జలుబు చేస్తుంది అనుకుంటారు. కానీ వైరస్ లేనిది జలుబు రాదు అంటున్నారు నిపుణులు.
వైరస్
అయితే వర్షం నీళ్లు చాలా శుభ్రంగా ఉంటాయి. కానీ గాలిలలో ఉండే వైరస్ వర్షపు చినుకుల ద్వారా మన శరీరంపై పడి నేరుగా ముక్కులోకి వెళ్తుందంట.
వర్షం నీళ్లు శుభ్రం
అందువలన జలుబు చేస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా కొన్ని సార్లు వర్షంలో తడిచినప్పుడు చలి ఎక్కువగా వేస్తుంటది.
జలుబు
మన శరీరం చలికి గురి అయినప్పుడు, ముక్కు, గొంతులోనికి వెళ్లి టెంపరేచర్ పడిపోతుంది.ఈ సమయంలో జలుబు చేసే వైరస్ శరీరంలోకి వెళ్లినప్పుడు, చల్లదనం వలన అది రెట్టింపు అయ్యి, జలుబు అవుతుందంట.
చలి
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.