AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: చికెన్ తింటే నిజంగానే ఒంట్లో వేడి చేస్తుందా..? దీన్ని వెనకున్న అసలు కథ తెలుసుకోండి..

వారంలో మూడు రోజులు చికెన్ ప్లేట్‌లో పడకపోతే నాన్ వెజ్ లవర్స్‌కు ముద్ద దిగదు. అయితే చాలా మంది చికెన్ తింటే శరీరంలో వేడి పెరుగుతుందని తినకుండా ఉంటారు. అయితే చికెన్ తినే విధానంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఏ కాలంలోనైనా అది శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నిజంగా చికెన్ తింటే వేడి పెరుగుతుందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Chicken: చికెన్ తింటే నిజంగానే ఒంట్లో వేడి చేస్తుందా..? దీన్ని వెనకున్న అసలు కథ తెలుసుకోండి..
Does Eating Chicken Increase Body Heat
Krishna S
|

Updated on: Jun 14, 2026 | 5:23 PM

Share

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే కేవలం ఆహారం కాదు.. అదొక ఎమోషన్.. బిర్యానీ, కర్రీ, ఫ్రై, కబాబ్.. ఇలా ఏ రూపంలో ఉన్నా ప్లేట్లు ఖాళీ చేయాల్సిందే. అయితే చాలా మంది కేవలం ఎండాకాలంలోనే చికెన్ తింటే వేడి చేస్తుంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం అనే తేడా లేకుండా.. చికెన్ తినే విధానంలో చిన్న చిన్న తప్పులు చేస్తే ఏ కాలంలోనైనా సరే అది శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చికెన్‌లో లీన్ ప్రోటీన్ చాలా ఎక్కువ. మన శరీరం కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్‌ను చాలా సులభంగా అరిగించుకుంటుంది. కానీ ప్రోటీన్‌ను బ్రేక్ చేయడానికి జీర్ణవ్యవస్థ విపరీతమైన శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. సైన్స్ భాషలో దీనిని థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటారు. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో సహజంగానే కొంత వేడి పుడుతుంది. కాబట్టి బాడీ హీట్ పెరగడానికి చికెన్ ఒక్కటే కారణం కాదు.. మనం తాగే నీటి శాతం తగ్గడం, అందులో వాడే మసాలాల డోస్ పెరగడమే అసలు కారణం.

బ్రాయిలర్ చికెన్ వర్సెస్ నాటుకోడి

మార్కెట్‌లో మనకు దొరికే చికెన్‌లో ఈ రెండు రకాలపై ఎప్పుడూ పెద్ద చర్చ నడుస్తూనే ఉంటుంది.

బ్రాయిలర్ చికెన్ : ఇది చాలా సాఫ్ట్‌గా ఉండి త్వరగా ఉడుకుతుంది. ఇందులో కొవ్వు శాతం నాటుకోడి కంటే కాస్త ఎక్కువ. అయితే ఫామ్‌లలో వీటికి యాంటీబయాటిక్స్ ఇస్తారనే ప్రచారం ఉంది కాబట్టి నమ్మకమైన చోట, పూర్తి పరిశుభ్రమైన వాతావరణంలో పెరిగిన చికెన్ ఎంచుకోవడం మంచిది.

నాటుకోడి: ఇందులో లీన్ ప్రోటీన్ చాలా ఎక్కువ, ఫ్యాట్స్ చాలా తక్కువ. దీని మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది. నాటుకోడి పులుసు లేదా సూప్ తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు నాటుకోడి సూప్ బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తుంది.

చికెన్‌లోని ఏ భాగం ఆరోగ్యానికి మంచిది?

చికెన్ మొత్తం ఒకే రకమైన పోషకాలను కలిగి ఉండదు. మీరు తినే భాగాన్ని బట్టి కొవ్వు, ప్రోటీన్ శాతాలు మారుతుంటాయి.

చికెన్ బ్రెస్ట్: బరువు తగ్గాలనుకునే వారికి, జిమ్‌కి వెళ్లే బాడీ బిల్డర్లకు ఇది గోల్డ్ స్టాండర్డ్ ఫుడ్. ఇందులో ప్యూర్ లీన్ ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ అస్సలు ఉండవు.

చికెన్ లెగ్స్ – థైస్ : ఈ మాంసం కాస్త డార్క్‌గా ఉంటుంది. ఇందులో బ్రెస్ట్ పీస్ కంటే కొవ్వు, క్యాలరీలు కొంచెం ఎక్కువ ఉంటాయి. కానీ ఇవి చాలా జ్యుసీగా, రుచిగా ఉంటాయి.

చికెన్ స్కిన్: చికెన్‌ను చర్మంతో సహా వండటం అస్సలు మంచిది కాదు. కోడి చర్మంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడూ స్కిన్‌లెస్ చికెన్ తినడమే ఉత్తమం.

ఏ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వేసవి కాలంలో: ఈ కాలంలో మసాలాలు, ఫ్రైలు పూర్తిగా తగ్గించాలి. చికెన్‌ను ఉడకబెట్టి లేదా లైట్ గ్రేవీతో వండుకోవాలి. చికెన్ తిన్న తర్వాత బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి చలవ చేసే పదార్థాలు ఖచ్చితంగా డైట్‌లో ఉండాలి.

వర్షాకాలం – చలికాలంలో: ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల జీర్ణక్రియ కాస్త మందగిస్తుంది. కాబట్టి రాత్రిపూట హెవీగా చికెన్ బిర్యానీలు తినడం తగ్గించాలి. ఈ కాలంలో వేడివేడి చికెన్ సూప్ తాగడం వల్ల బాడీకి ఇన్స్టంట్ ఎనర్జీ రావడంతో పాటు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.

Follow Us