AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artificial Blood: వైద్య శాస్త్రంలో అరుదైన ఆవిష్కరణ.. కృత్రిమ రక్తాన్ని తయారు చేసిన పరిశోధకులు..

సమయానికి రక్తం లభించక ప్రాణాలు వదిలే వారు ఎంతో మంది ఉన్నారు. వందల సంఖ్యలో బ్లడ్‌ బ్యాంకులు ఉన్నా, ఎంతో మంది స్వచ్ఛందంగా రక్త దానం చేస్తున్నా ఇప్పటికీ సమయానికి రక్తం అందక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. అయితే ఇకపై ఈ సమస్య ఉండదని పరిశోధకులు..

Artificial Blood: వైద్య శాస్త్రంలో అరుదైన ఆవిష్కరణ.. కృత్రిమ రక్తాన్ని తయారు చేసిన పరిశోధకులు..
Artificial Blood
Narender Vaitla
|

Updated on: Nov 11, 2022 | 8:36 PM

Share

సమయానికి రక్తం లభించక ప్రాణాలు వదిలే వారు ఎంతో మంది ఉన్నారు. వందల సంఖ్యలో బ్లడ్‌ బ్యాంకులు ఉన్నా, ఎంతో మంది స్వచ్ఛందంగా రక్త దానం చేస్తున్నా ఇప్పటికీ సమయానికి రక్తం అందక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. అయితే ఇకపై ఈ సమస్య ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. చెప్పడమే కాదు ఆ దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయి. ల్యాబ్‌లో కృత్రిమ రక్తాన్ని చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వైద్య శాస్త్రంలోనే తొలిసారిగా ల్యాబ్‌లో తయారు చేసిన రక్తాన్ని ఇద్దరికి ఎక్కించారు. మానవ శరీరంలో ఈ ఆర్టిఫిషియల్‌ బ్లడ్‌ ఎలా పనిచేస్తుందన్న దానిపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ను యూకేలో నిర్వహించారు. క్రేంబ్రిడ్జ్‌, బ్రిస్టల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 10 ఏళ్లపాటు చేసిన పరిశోధనల ఫలితమే ఈ కృత్రిమ రక్తం. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. పరీక్షలు విజయవంతమైతే ఇది ఇది మానవ చరిత్రలో అతిపెద్ద వైద్య విజయం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్‌ బ్లడ్‌ వల్ల తలసేమియా, రక్తహీనత వంటి వ్యాధులను జయించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 10 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లలో ఈ కృత్రిమ రక్తాన్ని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ వాలంటీర్లకు నాలుగు నెలల వ్యవధిలో రెండుసార్లు రక్తం ఎక్కిస్తారు. అందులో ఒకటి సాధారణ రక్తం కాగా మరొకటి ల్యాబ్‌లో తయారు చేసిన కృత్రిమ రక్తాన్ని అందజేస్తారు. కృత్రిమ రక్తానికి శరీరం ఎలా స్పందిస్తుందన్న విషయాలను తెలుసుకోనున్నారు.

ఇదిలా ఉంటే ఇలాంటి రక్తాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం చాలా కష్టం, ఖరీదైన పని అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ల్యాబ్‌లో ఈ రక్తాన్ని అభివృద్ధి చేయడానికి చాలా ఖర్చు అవుతుందని చెబుతున్నారు. బ్రిటన్‌లోలాగే జపాన్‌లోనూ చాలా ఏళ్ల నుంచి ల్యాబ్‌లో రక్తాన్ని తయారు చేస్తున్నారు. కానీ ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయా లేదా అన్న దానిపై ఇప్పటి వరకు ఆ దేశాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బ్రిటన్‌ పరిశోధకులు మాత్రం ఈ విషయంలో ధీమాతో ఉన్నారు. రక్తం దొరకలేదన్న కారణంతో ఇకపై ఎవరూ మరణించరని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..