కొనసాగుతోన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల తొలగింపు.. తాజాగా మరో దిగ్గజ సంస్థ.. ఐటీలో అసలేం జరుగుతోంది.?

గతకొన్ని రోజుల నుంచి జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందా.? అన్న అనుమానాలు రాక మానవు. ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగుల్లో కోత పెట్టే పనిలో పడ్డాయి. ఇప్పటికే ట్విట్టర్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకున్నాయి. అయితే ఇప్పుడీ..

కొనసాగుతోన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల తొలగింపు.. తాజాగా మరో దిగ్గజ సంస్థ.. ఐటీలో అసలేం జరుగుతోంది.?
Amzong Layoffs
Follow us

|

Updated on: Nov 11, 2022 | 5:47 PM

గతకొన్ని రోజుల నుంచి జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందా.? అన్న అనుమానాలు రాక మానవు. ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగుల్లో కోత పెట్టే పనిలో పడ్డాయి. ఇప్పటికే ట్విట్టర్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకున్నాయి. అయితే ఇప్పుడీ జాబితాలో ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌ కూడా వచ్చి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వస్తోన్న ఈ సంస్థ తాజాగా ఉద్యోగులను సాగనంపే పని మొదలు పెట్టింది.

తనను ఉద్యోగం నుంచి తొలగించారని అమెజాన్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగంలో పనిచేస్తున్న జామీ జాంగ్ అనే ఐటీ ఉద్యోగి లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయడంతో ఈ అంశం ఒక్కసారిగా కలకలం రేపింది. అంతేకాకుండా రోబోటిక్స్‌ టీమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పింక్‌ స్లిప్‌లు ఇచ్చారని జామీ జాంగ్ పోస్ట్‌ చేయడం మరింత ఆందోళ కలిగిస్తోంది. ఇదిలా ఉంటే అమెజాన్‌ ఎంత మంది ఉద్యోగులను తొలగించిందన్న విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఆర్థిక మాంద్యం రానుందన్న వార్తలు కంపెనీ ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోవడమే అమెజాన్‌ ఉద్యోగుల తొలగింపుకు కారణంగా తెలుస్తోంది.

అమెజాన్‌ గత వారం రోజుల నుంచే ఉద్యోగుల తొలగింపును ప్రారంభించిందని, నియమకాలను సైతం పూర్తిగా ఆపేసిందని తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపు ఇంకా కొనసాగనుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే భవిష్యుత్తు అంతా రోబోటిక్స్‌దేనని మార్కెట్‌ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో అమెజాన్‌ ఆ విభాగంలో పనిచేసిన వారినే తొలగించడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం వచ్చే ఏడాది మరింత తీవ్ర కానుందన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగాల పరిస్థితి ఏంటన్న దానిపై సర్వత్ర చర్చ సాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..