Telangana: ఇంటర్ సిలబస్ మార్పు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
తెలంగాణ ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేయాలన్న వాదనలు గత కొన్ని రోజులుగా వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో..
తెలంగాణ ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేయాలన్న వాదనలు గత కొన్ని రోజులుగా వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకోసం ఇంటర్ సిలబస్ మార్పులపై ఓ కమిటీని నియమించారు. ఈ విషయాన్ని శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్వయంగా తెలిపారు. తాజాగా ఇంటర్ బోర్డ్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఎలాంటి తీర్మానాలు చేయలేదని తెలిపారు. గడిచిన కొన్నేళ్లుగా పాఠ్యపుస్తకాల పంపిణీలో ఆలస్యమవుతోందని తెలిపిన మంత్రి, ఈసారి ఆ పరిస్థితులు రాకుండా ఇప్పుడే ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పాఠశాలలు తిరిగి ప్రారంభంకాగానే పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇక ఈ సమావేశంలో కాలేజీల గుర్తింపుపై కూడా చర్చ జరిగిందని చెప్పిన మంత్రి.. మే చివరివరకు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కాలేజీలు ప్రారంభం అయ్యాక కూడా గుర్తింపు ఇస్తూ పోతున్నామన్న మంత్రి ఇకపై మే లోపే పూర్తి చేస్తామన్నారు. ఇక ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి గుర్తింపు వచ్చే ఏడాది వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపిన సబిత.. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఫైర్ డిపార్టుమెంట్ అనుమతి ఇచ్చిన వెంటనే గుర్తింపు ఇస్తామని తెలిపారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..