US VISA: ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారతీయులకు ప్రాధాన్యత..

ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వారికి ఆ దేశం గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికన్ వీసాల జారీ కోసం వేచి ఉండే కాలాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. వీసాల జారీలో జాప్యం కారణంగా..

US VISA: ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారతీయులకు ప్రాధాన్యత..
US Visa
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 11, 2022 | 7:49 AM

ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వారికి ఆ దేశం గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికన్ వీసాల జారీ కోసం వేచి ఉండే కాలాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. వీసాల జారీలో జాప్యం కారణంగా కోవిడ్ తర్వాత అమెరికా వెళ్లాలనుకునేవారు నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం వీసాల జారీని వేగవంతం చేయనున్నట్లు ప్రకటించడంతో అమెరికా వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశం లభించనుంది. అమెరికా వీసాల కోసం నిరీక్షించాల్సిన సమయం భవిషత్యులో తగ్గే అవకాశం ఉందని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. భారతీయులకు ప్రతినెలా లక్ష వీసాలను మంజూరు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. గత ఏడాది 82 వేల వీసాలివ్వగా.. వచ్చే ఏడాది జూన్‌ నాటికి 11 లక్షల నుంచి 12 లక్షల వరకు వీసాల మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. వీసాల మంజూరు విషయంలో భారత దేశమే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. వీసాల జారీ విషయంలో కోరానాకు ముందున్న పరిస్థితులను వచ్చే ఏడాది మధ్య నాటికి తీసుకురావాలనేది తమ లక్ష్యమని వెల్లడించింది.

వీసా మంజూరు, రెన్యువల్‌కు పడుతున్న సుదీర్ఘ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సిబ్బందిని పెంచడంతో పాటు డ్రాప్‌ బాక్స్‌ విధానాన్ని అనుసరించనున్నట్లు రాయబార కార్యాలయం పేర్కొంది. డ్రాప్‌ బాక్స్‌ విధానం ద్వారా వీసా రెన్యువల్ సులభం కానుంది. ఇంటర్వ్యూ లేకుండా వీసా రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్లుగా అమెరికా వీసా ఉన్నవారు దీనికి అర్హులు కానున్నారు. భారతీయులకు హెచ్‌ 1బి, ఎల్‌ కేటగిరీ వీసాల మంజూరును ప్రాధాన్య అంశంగా అమెరికా గుర్తించింది. విద్యార్థి వీసాల జారీ సమయాన్ని.. ముఖ్యంగా రెన్యువల్‌ సమయాన్ని తగ్గించడాన్ని కూడా ప్రాధాన్యంగా పెట్టుకున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. వీసా రెన్యువల్‌కు ఎదురుచూస్తున్న వారి కోసం ఇటీవల దాదాపు లక్ష స్లాట్లను విడుదల చేసినట్లు పేర్కొంది.

కొన్ని వీసాల మంజూరుకు గతంలో 450 రోజులు పడుతుండగా.. దానిని 9 నెలలకు తగ్గించామని తెలిపింది. బీ1, బీ2 వీసాల మంజూరు సమయాన్ని మరింత తగ్గించినట్లు పేర్కొంది. అమెరికా వీసాలు పొందుతున్న దేశాల్లో త్వరలోనే భారత్‌ రెండో స్థానంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ప్రస్తుతం మెక్సికో, చైనా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. అమెరికాలో చదువుకునే విద్యార్థుల వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, వీసాల పునరుద్ధరణ కోసం చూస్తున్న వారికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్