AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

November 11th: నేడు 4 దేశాలకు స్వాతంత్య్రం వచ్చిన రోజు.. చరిత్రలో నవంబర్ 11 వ తేదీకి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా

నవంబరు 11న ఎందరో మహానుభావులు జన్మించారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దేశాలకు స్వాతంత్య్రం వచ్చింది.  మన దేశంలో మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నవంబర్ 11 న జరుపుకుంటారు.

November 11th: నేడు 4 దేశాలకు స్వాతంత్య్రం వచ్చిన రోజు.. చరిత్రలో నవంబర్ 11 వ తేదీకి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
11 November History
Surya Kala
|

Updated on: Nov 11, 2022 | 9:12 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ ఏదొక విశిష్టతను కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 11 వ తేదీ కూడా చరిత్రలో  ఎన్నో మంచి చెడు సమాహారంగా  చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. నవంబరు 11న ఎందరో మహానుభావులు జన్మించారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దేశాలకు స్వాతంత్య్రం వచ్చింది.  మన దేశంలో మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నవంబర్ 11 న జరుపుకుంటారు. ఈరోజుని దేశంలో ‘జాతీయ విద్యా దినోత్సవం’గా జరుపుకుంటారు. దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, పండితుడు, ప్రముఖ విద్యావేత్త అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబర్ 11న మక్కాలో జన్మించారు.

1890లో ఆజాద్ తన కుటుంబంతో కలకత్తా (ప్రస్తుతం కోల్‌కతా)కి వచ్చారు. మౌలానా పూర్వీకులు మొఘల్ రాజు బాబర్ పాలన సమయంలో భారతదేశానికి వచ్చారు. ఆజాద్‌కు కేవలం 13 ఏళ్ల వయసులోనే వివాహమైంది. అతని భార్య పేరు జులేఖా బేగం. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలో దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆజాద్‌కి ఒకటి రెండు కాదు అనేక భాషలపై అవగాహన ఉంది. అతనికి అరబిక్, బెంగాలీ, పర్షియన్ , ఇంగ్లీషు సహా అనేక భాషలపై పరిజ్ఞానం ఉంది.

ఆజాద్‌కి రచనలంటే ఇష్టం. దీంతో 1899లో నైరంగ్-ఎ-ఆలం అనే మాసపత్రికను ప్రారంభించారు. దేశంలో ఆధునిక విద్యా వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా  ఆజాద్ అనేక చర్యలు తీసుకున్నారు. దేశ చరిత్రలో నవంబర్ 11వ తేదీ విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

నవంబర్ 11 చరిత్ర

1809 -బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని కేరళలోని వేలుతంపి ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిని ‘కుందర డిక్లరేషన్’గా పిలుస్తారు.

1811 – కొలంబియా దేశం స్పెయిన్ నుండి విడివడి  స్వతంత్రం దేశంగా ప్రకటించబడింది.

1943 – భారతీయ అణు శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ జననం.

1982 – ఇజ్రాయెల్ సైనిక ప్రధాన కార్యాలయంలో గ్యాస్ పేలుడులో 60 మంది మరణించారు.

1982 – ప్రముఖ కవి, గీత రచయిత ఉమాకాంత్ మాలవ్య మరణించారు.

1888 – మౌలానా అబుల్ కలాం ఆజాద్, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం మొదటి విద్యా శాఖ మంత్రి  సౌదీ అరేబియాలో జన్మించారు.

1888 – ప్రసిద్ధ భారతీయ విప్లవకారుడు, రాజకీయ నాయకుడు జె. బి. కృపలానీ హైదరాబాద్ (సింధ్)లో జన్మించారు.

1918 – పోలాండ్ స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది.

1966 – అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా జెమిని-12 అంతరిక్ష నౌకను ప్రయోగించింది.

1973 – మొదటి అంతర్జాతీయ తపాలా స్టాంపు ప్రదర్శన న్యూఢిల్లీలో ప్రారంభమైంది.

1975 – అంగోలా పోర్చుగల్ నుండి స్వాతంత్య్రం పొందింది.

2004 – యాసర్ అరాఫత్, పాలస్తీనా నాయకుడు, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు, 75 సంవత్సరాల వయస్సులో మరణించారు.

2008 – ఆధునిక కాలంలో ప్రసిద్ధ హిందీ, రాజస్థానీ రచయిత కన్హయ్యలాల్ సేథియా మరణించారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..