AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meta Lay Offs: మెటా ఉద్యోగిణికి చేదు అనుభవం.. మెటర్నిటీ సెలవుల్లో ఉండగా జాబ్ నుంచి తొలగింపు

అన్నెక కు మే 2020లో మెటాలో ఉద్యోగం వచ్చింది. కోవిడ్ తర్వాత.. ఆన్‌లైన్ వినియోగం చాలా పెరిగింది. దీంతో META తన సిబ్బందిని గత రెండేళ్లలో  రెట్టింపు చేసింది. అనేక నియామకాలు చేపట్టింది. దీంతో మొత్తం మెటాలో ఉద్యోగులు సుమారు 90 వేలకు చేరుకున్నారు.

Meta Lay Offs: మెటా ఉద్యోగిణికి చేదు అనుభవం.. మెటర్నిటీ సెలవుల్లో ఉండగా జాబ్ నుంచి తొలగింపు
Anneka Patel
Surya Kala
|

Updated on: Nov 11, 2022 | 2:58 PM

Share

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో  భారీ సంఖ్యలో తన ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఒక్కసారిగా  11,000 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిల్చింది. అయితే ప్రస్తుతం లింక్డ్ఇన్ పోస్ట్ ఓ పోస్టర్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ పోస్ట్‌ను భారతీయ సంతతికి చెందిన అన్నెకా పటేల్ అనే మహిళ చేసింది. తన పోస్ట్‌లో తన ఉద్యోగం గురించి తల్లిగా బాధ్యతల గురించి తెలియజేసింది. తాను ప్రస్తుతం ప్రసూతి సెలవుపై ఉన్నట్లు అన్నెకా పటేల్ తెలియజేసింది.  తెల్లవారు జామున తన మూడు నెలల పాపకు ఎమిలియా తినిపించడానికి నిద్ర లేచి.. అప్పుడు తన మొబైల్ చెక్ చేసుకుని ఖంగు తిన్నట్లు పేర్కొంది. తనకు మెటా నుంచి ఒక మెయిల్ వచ్చింది. అందులో తనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఉందని తెలిపింది అన్నెక.

‘ఉదయం 5.35 గంటలకు నాకు ఒక ఇమెయిల్ వచ్చింది..  బుధవారం తొలగించిన 11,000 మంది ఉద్యోగులలో తాను ఒకరని అన్నెక పటేల్ తెలిపింది. తాను ఉద్యోగం పొగొట్టుకున్నా అన్న విషయం తెలిసిన వెంటనే చాలా బాధపడ్డాను అంతేకాదు ఇక నుంచి ఏమీ చేయాలనీ అనే ప్రశ్నను తనలో తాను వేసుకున్నాని.. ఎందుకంటే తాను ఇప్పుడు ప్రస్తుతం ప్రసూతి సెలవుపై ఉన్నానని.. ఈ మెటర్నిటీ లీవ్ ఫిబ్రవరిలో ముగియనుంది. ఇప్పుడు కంపెనీ తీసుకున్న నిర్ణయం నా కెరీర్ పై తీవ్ర ప్రభావం  చూపిస్తుందని తాను భావిస్తునని పేర్కొంది. అన్నేకా పటేల్ యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌లో విద్యార్థి.

అన్నెక కు మే 2020లో మెటాలో ఉద్యోగం వచ్చింది. కోవిడ్ తర్వాత.. ఆన్‌లైన్ వినియోగం చాలా పెరిగింది. దీంతో META తన సిబ్బందిని గత రెండేళ్లలో  రెట్టింపు చేసింది. అనేక నియామకాలు చేపట్టింది. దీంతో మొత్తం మెటాలో ఉద్యోగులు సుమారు 90 వేలకు చేరుకున్నారు. అయితే కంపెనీ ఆశించిన స్థాయిలో వృద్ధి జరగలేదు. ఈ విషయాన్ని ఆ కంపెనీ యజమాని మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా తెలిపారు. మెటాలో పని చేయడానికి అన్నెక లండన్ నుంచి  యుఎస్‌కి వెళ్ళింది. అయితే ఇప్పుడు తాను తన సమయాన్ని ‘నా కూతురిని పెంచడానికి ఉపయోగిస్తానని చెప్పింది. కొత్త సంవత్సరంతో తాను ఉద్యోగం చేయడానికి ప్రయత్నిస్తానని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..