Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UK PM Rishi Sunak: చెవిలో ఏదో చెప్పిన అధికారి.. కీలక సమావేశం నుంచి హఠాత్తుగా నిష్క్రమించిన రిషి సునాక్

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను యూకే కు చెందిన  కార్బన్ బ్రీఫ్ డైరెక్టర్ లియో హిక్‌మాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాప్‌-27 సదస్సులోభాగంగా అడవుల పరిరక్షణ భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా.. రిషి సునాక్‌ మధ్యలోనే వెళ్లిపోయారని హిక్‌మాన్ ట్వీట్‌ చేశారు.

UK PM Rishi Sunak: చెవిలో ఏదో చెప్పిన అధికారి.. కీలక సమావేశం నుంచి హఠాత్తుగా నిష్క్రమించిన రిషి సునాక్
Uk Prime Minister Rishi Sun
Follow us
Surya Kala

|

Updated on: Nov 08, 2022 | 6:19 PM

బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ సోమవారం కాప్‌ -27 (COP27) ఈవెంట్ నుండి అకస్మాత్తుగా బయటకు వచ్చారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఉన్న సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈజిప్టు వేదికగా జరుగుతున్న కాప్‌ -27 వాతావరణ సదస్సు నుంచి హఠాత్తుగా బ్రిటన్ ప్రధాని రిషి వెళ్లిపోయారు. ఈ సదస్సులో ఫారెస్ట్ పార్టనర్‌షిప్ కోసం లాంచ్ చేస్తున్న సమయంలో రిషి తన సహాయకులతో సహా బయటకు వచ్చారు. ఈ సమయంలో అక్కడ ఉన్న సభ్యులందరూ గందరగోళానికి గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను యూకే కు చెందిన  కార్బన్ బ్రీఫ్ డైరెక్టర్ లియో హిక్‌మాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాప్‌-27 సదస్సులోభాగంగా అడవుల పరిరక్షణ భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా.. రిషి సునాక్‌ మధ్యలోనే వెళ్లిపోయారని హిక్‌మాన్ ట్వీట్‌ చేశారు.

ఈ సంఘటనకు ముందుకు వేదికపై కూర్చుని ఉన్న రిషి వద్దకు వెళ్లిన ఆయన సిబ్బంది.. ఎదో సునాక్ చెవిలో చెప్పారు. ప్రధాని సహాయకులు ఇద్దరు వచ్చి సునక్‌ని ఈవెంట్ నుండి నిష్క్రమించమని ఒప్పించారు. రిషి ఈ సదస్సు నుంచి నిష్క్రమించడానికి దాదాపు 2 నిమిషాల ముందు.. ఒక సహాయకుడు వేదికపైకి వచ్చి  రిషి చెవిలో గుసగుసలాడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇద్దరు ఎదో విషయంపై చర్చించారు. అప్పటికీ రిషి అలాగే వేదికపై కూర్చుని ఉన్నారు. కొద్దిసేపటికి మరో సిబ్బంది వచ్చి రిషిని అక్కడి నుంచి వెళ్లిపోదామని కోరారని హిక్‌మాన్ పేర్కొన్నారు. అయితే సునక్ అకస్మాత్తుగా COP27 ఈవెంట్ నుండి నిష్క్రమించడానికి సునాక్ తన సహాయకుల నుండి ఎలాంటి సమాచారం అందుకున్నారనేది అస్పష్టంగా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, సాధారణంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ UNFCCC లేదా COP27 అని పిలుస్తారు. ఈ సదస్సు గత ఆదివారం ఈజిప్షియన్ రిసార్ట్ టౌన్ షర్మ్ ఎల్-షేక్‌లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు రిషి హాజరుకాకూడదని మొదట నిర్ణయించుకున్నారు. అయితే తీవ్ర విమర్శలు రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని ఈజిప్టులో జరిగిన కీలక వాతావరణ సమావేశానికి  హాజరయ్యారు.  తర్వాత యూ-టర్న్ తీసుకున్న తర్వాత శ్వేతజాతీయేతర బ్రిటీష్ ప్రధానమంత్రి షర్మ్ ఎల్-షేక్ చేరుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ మార్పులపై ప్రసంగించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..