AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Son’s Love: 35 ఏళ్ల తర్వాత తల్లి గొంతు విన్న తనయుడు.. ఆనందం తట్టుకోలేక కన్నీరు.. నెట్టింట్లో వీడియో వైరల్

ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లీ కొడుకుల ఈ క్లిప్‌ని చూసిన వారి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తాము కూడా ఆ సందర్భాన్ని అనుభవిస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు.

Son's Love: 35 ఏళ్ల తర్వాత తల్లి గొంతు విన్న తనయుడు.. ఆనందం తట్టుకోలేక కన్నీరు.. నెట్టింట్లో వీడియో వైరల్
Mother And Son Love Video Video
Surya Kala
|

Updated on: Nov 08, 2022 | 6:48 PM

Share

పుట్టిన వెంటనే శిశువు వినేది తల్లి మాట.. తల్లిలాలి పాట.. అమ్మ ముద్దు మురిపాలను వింటూ పెరిగి పెద్దయ్యి విద్యాబుద్ధు నేర్చి సంఘంలో తనకంటూ పేరు ప్రతిష్టలను సొంతం చేసుకుంటారు. అయితే పుట్టిన తర్వాత వినికిడి కోల్పోయి..  కొన్నాళ్ల తర్వాత తన తల్లి గొంతు విన్న పిల్లవాడి పరిస్థితిని ఒక్కసారి  ఊహించుకోండి.. అటువంటి సందర్భంలో ఆ తనయుడు ఎలాంటి ఫీలింగ్ ను కలిగి ఉంటాడు? ఈ అందమైన ఆ క్షణాలను అక్షరాలలో వర్ణించలేము. తాజాగా ఓ యువకుడు 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన తల్లి గొంతుని విన్నాడు. ఆ క్షణంలో తన ఆనందాన్ని ఆవేదనను ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లీ కొడుకుల ఈ క్లిప్‌ని చూసిన వారి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తాము కూడా ఆ సందర్భాన్ని అనుభవిస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు తన తల్లి దగ్గర కూర్చున్నట్లు చూడవచ్చు. అబ్బాయి చెవిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. తల్లి కొడుకుని  నువ్వు నా మాట వినగలుగుతున్నావా.. అని అడిగింది. ఆ యువకుడి చెవుల్లో తొలిసారిగా తల్లి స్వరం ప్రతిధ్వనించగానే.. ఆనందం ఆపుకోలేక ఏడుస్తున్నాడు. ఆ తర్వాత తల్లీ కొడుకులిద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎంత ఉద్వేగానికి గురిచేసింది ఈ సందర్భం.  తల్లీ కొడుకులను చూసి మిగిలిన కుటుంబ సభ్యులు కూడా  చిన్న పిల్లలు కూడా కన్నీరుమున్నీరుగా విలపించారు. నన్ను నమ్మండి.. ఈ అందమైన క్షణాన్ని చూస్తే మీ కళ్ళు కూడా చెమర్చకుండా ఉండలేవు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ చూడండి, తల్లీ కొడుకుల భావోద్వేగ వీడియో

చాలా ఉద్వేగభరితమైన ఈ వీడియో Instagramలో goodnews_movement అనే ఖాతాతో షేర్ చేశారు. ఎడ్వర్డో అనే యువకుడు.. పుట్టిన రెండు సంవత్సరాల నుంచి మెనింజైటిస్తో బాధపడుతున్నాడు. దీంతో అతని రెండు చెవులు వినే సామర్థ్యాన్ని కోల్పోయాయి. 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా తల్లి గొంతు విని ఏడ్చాడు. కొడుకును ఆ తల్లి ఎంత సంతోషంగా ఆలింగనం చేసుకుంది. ఈ వీడియో చాలా ఎమోషనల్‌గా ఉంది.

ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్ష మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు వీడియోను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో నన్ను ఏడిపించింది. ఎడ్వర్డోను మేము కూడా ప్రేమిస్తున్నాం.. ఇష్టపడుతున్నాం అని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..