Drunken Girls: మద్యం మత్తులో పబ్ ముందు అమ్మాయిలు రచ్చ.. ఓ మహిళపై దాడి.. వినోదం చూసిన స్థానికులు

నలుగురు అమ్మాయిలు కలిసి మరో అమ్మాయిపై బెల్ట్‌లు, చెప్పులతో దాడి చేశారు. కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ అమ్మాయిల గొడవను అక్కడున్నవారందరూ సినిమా చూసినట్లు చూశారే కానీ ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Drunken Girls: మద్యం మత్తులో పబ్ ముందు అమ్మాయిలు రచ్చ.. ఓ మహిళపై దాడి.. వినోదం చూసిన స్థానికులు
Drunken Girls Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Nov 08, 2022 | 5:05 PM

ఆధునిక కాలం మగవారితో అన్నింటా సమానం అంటూ.. అన్ని రంగాల్లోనూ పురుషులతో స్త్రీలు పోటీ పడుతున్నారు. తమ శక్తి సామర్ధ్యాలను నిరూపించుకుంటూ అందలం అధిరోహిస్తున్నారు. తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటున్నారు. అయితే మరొకొందరు యువతలు.. మాత్రం సమానత్వం అంటే తాగడం తిరగడం నడి రోడ్డుమీద రచ్చ చేయడం అనుకుంటున్నట్లు ఉన్నారు. అందుకు ఉదాహరణగా నిలిచింది తాజా సంఘటన.. అవును కొందరు అమ్మాయిలు తాగిన మత్తులో నానా రచ్చ చేశారు. పబ్‌ బయట ఒకరినొకరు తన్నుకున్నారు. నలుగురు అమ్మాయిలు కలిసి మరో అమ్మాయిపై బెల్ట్‌లు, చెప్పులతో దాడి చేశారు. కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ అమ్మాయిల గొడవను అక్కడున్నవారందరూ సినిమా చూసినట్లు చూశారే కానీ ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబదించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పబ్ వెలుపల ఈ సంఘటన జరిగింది. బూతులు తిడుతూ ఆ యువతిని జుట్టుపట్టి లాగుతూ, కిందపడేసి మరీ పిచ్చ పిచ్చగా కొట్టారు. ఆ మహిళ సహాయం కోసం కేకలు వేసినప్పటికీ అక్కడున్న వారు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఆ కొట్లాటను ఆపుదామని ఎవరూ ముందుకు రాలేదు. కళ్లప్పగించి అమ్మాయిల ఫైటింగ్‌ను తమాషా చూసినట్లు చూశారు. మరికొందరు తమ సెల్ ఫోన్లకు పని చెప్పి.. ఈ ఘటనను వీడియో తీశారు..

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఆ వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఇండోర్‌ పోలీసుల దృష్టికి వెళ్లింది. యువతిపై దాడికి పాల్పడిన నలుగురు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ యువతిని ఎందుకలా కొట్టారు అన్నదానిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..