Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lunar Eclipse: గ్రహణంవేళ చికెన్ బిర్యాని తెచ్చిన గోల.. హేతువాదులతో సంప్రదాయవాదులు వాగ్వాదం.. పోలీసులపై రాళ్లదాడి

చంద్రగ్రహణం వేళ బిర్యానీ ఫెస్టివల్‌ వీధి పోరాటాలకు దారితీసింది. లోహియా అకాడమీ దగ్గరకు చేరుకున్న పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. లాఠీఛార్జ్‌లో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల పైకి కొందరు రాళ్లు రువ్వారు .

Lunar Eclipse: గ్రహణంవేళ చికెన్ బిర్యాని తెచ్చిన గోల.. హేతువాదులతో సంప్రదాయవాదులు వాగ్వాదం.. పోలీసులపై రాళ్లదాడి
Lunar eclipse controversy in Odisha
Follow us
Surya Kala

|

Updated on: Nov 08, 2022 | 7:01 PM

చంద్రగ్రహణం వేళ ఒడిశాలో హేతువాదులకు , బజరంగ్‌దళ్‌ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఒడిశాలోని ‘హేతువాదులు’ సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో సంప్రదాయ మతపరమైన నిబంధనలను బహిరంగంగా ధిక్కరించి, చికెన్ బిర్యానీ తినడం ద్వారా ఆంక్షలకు వ్యతిరేకంగా ‘నిరసిస్తూ’ ఇటీవల వార్తల్లో నిలిచారు. చంద్రగ్రహణం వేళ భువనేశ్వర్‌ , బరంపురంతో సహా పలు ప్రాంతాల్లో లోహియా అకాడమీ నేతృత్వంలో చికెన్‌ బిర్యానీ ఫెస్టివల్‌ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో సమావేశమై గ్రహణం రోజున వండడం, ఆహారం తీసుకోవడంపై సంప్రదాయ ఆంక్షలు విధించడం మూఢనమ్మకాలు తప్ప మరేమీ కాదని, అందుకే గ్రహణం నాడు చికెన్ బిర్యానీ తింటున్నామని  ప్రకటన చేశారు. అయితే ఇది హిందూ సాంప్రదాయానికి విరుద్దమని బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. లోహియా అకాడమీని ముట్టడించారు.

ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నాయి. చంద్రగ్రహణం వేళ బిర్యానీ ఫెస్టివల్‌ వీధి పోరాటాలకు దారితీసింది. లోహియా అకాడమీ దగ్గరకు చేరుకున్న పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. లాఠీఛార్జ్‌లో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల పైకి కొందరు రాళ్లు రువ్వారు . రాళ్లదాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

రాళ్లురువ్విన వాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘హేతువాద’ నాయకులు దేబేంద్ర సుతార్ , ప్రతాప్ రథ్‌లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. హత్య బెదిరింపు చేసినందుకు పలు సెక్షన్లు కూడా నమోదు చేశారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..