Chandra Grahanam: గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు .. ఇత్తడి పళ్లెంలో రోకలి నిలబెట్టిన మహిళలు..
గ్రహణ సమయంలో ప్రత్యేక పద్ధతిలో మంత్రాలను పాటిస్తూ తమ ఇష్టమైన దేవుడిని ఆరాధిస్తున్నారు. చంద్ర గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రహణం సందర్భంగా అనేక ప్రాంతాల్లోని మహిళలు పోటీపోటీగా ఇత్తడి పళ్లెంలో రోకలిని నిలబెట్టారు.
ఈ ఏడాది చిట్ట చివరి చంద్ర గ్రహణం ఏర్పడింది. గ్రహణ సమయంలో ప్రజలు అనేక ఆచారాలను, పద్దతులను పాటించారు. చంద్రగ్రహణ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను, ఆలయాలను మూసివేశారు. కొన్ని ప్రాంతాల్లో గ్రహణ పట్టు స్నానాలను చేశారు… మరొకొందరు గ్రహణ సమయంలో ప్రత్యేక పద్ధతిలో మంత్రాలను పాటిస్తూ తమ ఇష్టమైన దేవుడిని ఆరాధిస్తున్నారు. చంద్ర గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రహణం సందర్భంగా అనేక ప్రాంతాల్లోని మహిళలు పోటీపోటీగా ఇత్తడి పళ్లెంలో రోకలిని నిలబెట్టారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి రమణయ్యపేటలో చంద్రగ్రహణం సందర్భంగా ఇత్తడి పళ్ళెంలో మహిళలు నీరు పోసి రోకలిబెట్టారు. ఇంటి ముందు ముగ్గువేసి.. అందంగా ఆ ముగ్గుని అలంకరించి పూజాది కార్యక్రమాలను నిర్వహించి.. ఆ ముగ్గులో ఇత్తడి పళ్లెం ఏర్పాటు చేశారు. అనంతరం ఆ పళ్లెంలో నీరు పోసి.. రోకలిని పెట్టారు. గ్రహణ సమయంలో రోకలి నిటారుగా నిలబడింది. ఈ రోకలి సాయంత్రం చంద్రగ్రహణం పట్టు విడిచే వరకు నిలబడే ఉంటుందని మహిళలు చెబుతున్నారు. .. గ్రహణ సమయాల్లో అరుదుగా కనిపించే ఇటువంటి దృశ్యాలను తిలకించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..