Yanam: యానాంలో పేకాట క్లబ్స్ పై మల్లాడి ఫైర్.. నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు కావాలంటే క్లబ్ మూసేయాలని డిమాండ్
తాను ఈ పేకాట క్లబ్స్ మూయించే వరకు నిద్రపోనని శబధం చేశారు మల్లాడి కృష్ణారావు. ఈ పేకాట క్లబ్స్ మూయించడానికి ఎవరు సహకరించక పోయినా వారిని కూడా వ్యతిరేకస్తానని .. సీఎం తో సహా ఎంత మంది పెద్దలు ఈ విషయంలో సపోర్ట్ చేసినా తాను వెరవనని పేర్కొన్నారు.

యానాం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రీక్రియేషన్ పేరుతో పేకాట నిర్వహిస్తున్న పేకాట క్లబ్స్ పై మల్లాడి కృష్ణారావు ఫైర్ అయ్యారు. అంతేకాదు యానాం ఓల్డేజ్ హోమ్ వద్ద మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో పేకాట క్లబ్స్ మూసివేయాలని ధర్నా నిర్వహించారు. ఇప్పటికే స్థానిక పేకాట క్లబ్స్ మూసివేయాలని ఆర్డర్ వేశారు .. క్లబ్స్ యాజమాన్యం కోర్ట్ కు వెళ్లి మళ్ళీ తెరవడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు మల్లాడి. అయితే తాను ఈ పేకాట క్లబ్స్ మూయించే వరకు నిద్రపోనని శబధం చేశారు. ఈ పేకాట క్లబ్స్ మూయించడానికి ఎవరు సహకరించక పోయినా వారిని కూడా వ్యతిరేకస్తానని .. సీఎం తో సహా ఎంత మంది పెద్దలు ఈ విషయంలో సపోర్ట్ చేసినా తాను వెరవనని పేర్కొన్నారు.
రాబోయే ఎంపీ ఎన్నికల్లో మల్లాడి ఓట్లు కావాలంటే పేకాట క్లబ్స్ మూసివేయాడానికి సహకరించాలని అల్టిమేటం జారీ చేశారు. స్థానిక అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కి తెలియకుండా పేకాట క్లబ్స్ నిర్వహించే అవకాశం లేదన్నారు. ఈ పేకాట క్లబ్ నిర్వహణ కోసం స్థానిక ఎమ్మెల్యే అశోక్ తో పాటు పుద్దిచ్చేరి లో చాలా మంది సహకరిస్తున్నారని మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. ప్రస్తుతం యానం వ్యాప్తంగా 5 పేకాట క్లబ్స్ నడుస్తున్నాయని .. త్వరలో 50 క్లబ్స్ కు పర్మిషన్ కోసం అప్లై చేశారని.. ఇది మంచి నిర్ణయం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
