Andhra Pradesh: భూతగాదా నేపథ్యంలో అమానుషం .. తల్లీకూతుళ్లపై కంకర పోసి సమాధికి యత్నం..!

దాలమ్మ, సావిత్రిలతో కొట్రు రామారావుకు భూ వివాదం నడుస్తోంది. హైవే పక్కన ఉన్న 30 అడుగుల స్థలం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ స్థలంలో మాకూ వాటా వుందంటూ 2019 నుంచి రామారావుపై తల్లీబిడ్డలు పోరాటం చేస్తున్నారు.

Andhra Pradesh: భూతగాదా నేపథ్యంలో అమానుషం .. తల్లీకూతుళ్లపై కంకర పోసి సమాధికి యత్నం..!
Land Dispute In Srikakulam
Follow us
Surya Kala

|

Updated on: Nov 08, 2022 | 2:57 PM

శ్రీకాకుళం జిల్లా దారుణం జరిగింది. భూతగాదా నేపథ్యంలో తల్లీకూతుళ్లపై అమానుషంగా వ్యవహారించాడో వ్యక్తి. వారిద్దరిపై ట్రాక్టర్‌తో మట్టి పోయించాడు పొరుగు స్థలం యజమాని. చచ్చిపోతున్నాం కాపాడండి అంటూ తల్లికూతుర్లు బిగ్గరగా అరవడంతో స్థానికులు వచ్చి రక్షించారు. మందస మండలం హరిపురంలో ఈ ఘటన జరిగింది. దాలమ్మ, సావిత్రిలతో కొట్రు రామారావుకు భూ వివాదం నడుస్తోంది. హైవే పక్కన ఉన్న 30 అడుగుల స్థలం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ స్థలంలో మాకూ వాటా వుందంటూ 2019 నుంచి రామారావుపై తల్లీబిడ్డలు పోరాటం చేస్తున్నారు. అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిసి తల్లీకూతురు అక్కడ బైఠాయించారు.

వారిని అక్కడ్నించి తరిమేసేందుకు ట్రాక్టర్‌తో మట్టి పోయించాడు రామారావు. ఆనందరావు, ప్రకాశ్‌రావుల సాయంతో దుర్మార్గానికి ఒడిగట్టాడు. నడుములోతు వరకు వారిపై ట్రాక్టర్‌తో మట్టి పోసి అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశాడు. తల్లీబిడ్డపై జరిగిన హత్యాయత్నం స్థానికుల్ని ఉలిక్కిపడేలా చేసింది. స్థానికులు రాకుంటే తమ ప్రాణాలు పోయేవని ఆవేదన వ్యక్తం చేశారు తల్లీబిడ్డలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..