Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSR Statue in Ippatam: ఇప్పటంలో రాజన్న విగ్రహాల తొలగింపు.. మరోచోటుకి తరలింపు

ఇటీవల ఇళ్ల కూల్చివేతపై ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. రోడ్టు మీదకు ఉన్న వైఎస్ఆర్ విగ్రహం ఎందుకు తొలగించలేకపోయారని ప్రశ్నించారు. అంతకుముందు జనసేన పార్టీ కార్యాలయం వద్దే పవన్‌ను పోలీసులు అడ్డుకోగా.. మూడు కిలో మీటర్ల పాదయాత్రగా వెళ్లిపోయారు

YSR Statue in Ippatam: ఇప్పటంలో రాజన్న విగ్రహాల తొలగింపు.. మరోచోటుకి తరలింపు
Ysr Statue In Ippatam
Follow us
Surya Kala

|

Updated on: Nov 08, 2022 | 2:40 PM

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అసెంబ్లీ ఎన్నిలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పుడే వేడెక్కాయి. అధికార , ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ కూల్చేవేత రాజకీయాలు చేస్తున్నారంటూ జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఎట్టకేలకు వైఎస్ విగ్రహాన్ని కూడా తొలగించారు మున్సిపల్ అధికారులు. రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లు, గోడలు కూల్చివేత వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై నెటిజన్లు‌ సెటైర్లు వేస్తూ.. భారీగా ట్రోలింగ్ చేశారు. దీంతో అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఇప్పటం గ్రామంలో ‌వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించింది. క్రేన్ సాయంతో విగ్రహం తరలించారు. కొన్ని జాతీయ నాయకుల విగ్రహాలతో పాటు వైఎస్సార్ విగ్రహాన్ని కూడా తీసేశారు.

ఇటీవల ఇళ్ల కూల్చివేతపై ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. రోడ్టు మీదకు ఉన్న వైఎస్ఆర్ విగ్రహం ఎందుకు తొలగించలేకపోయారని ప్రశ్నించారు. అంతకుముందు జనసేన పార్టీ కార్యాలయం వద్దే పవన్‌ను పోలీసులు అడ్డుకోగా.. మూడు కిలో మీటర్ల పాదయాత్రగా వెళ్లిపోయారు. అనంతరం కాన్వాయ్ ఎక్కి ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకు ప్రభుత్వం కక్ష కట్టిందంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటంలో ఇళ్లు కూలిస్తే.. ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. రోడ్డు వెడల్పు అంటూ మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నెహ్రూ గారి విగ్రహాలు, ఆఖరికి శివుడికి కాపలాగా ఉండే నంది విగ్రహాన్ని కూడా కూల్చేశారని.. మరి వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చకుండా ఎందుకు వదిలేశారని నిలదీశారు. ఎట్టకేలకు విగ్రహాలను అక్కడి నుంచి తొలగించారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..