SI Dance: ఎమ్మెల్సీ పుట్టిన రోజు వేడుకల్లో అమ్మాయిలతో కలిసి చిరు సాంగ్ కి స్టెప్స్ వేసిన ఎస్సై.. క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అధికారులు

హద్దులు మీరిన వారిని కంట్రోల్‌ చేయాల్సిన SI స్వయాన స్టేజీ ఎక్కేశాడు.. అక్కడి జనం జనం ఈలలు వేసి ప్రోత్సహించడంతో మరింత రెట్టిపోయాడు. తనలో దాగి ఉన్న టాలెంట్‌నంతా బయటకు తీసి మరీ మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ అబ్బనీ తియ్యనీ దెబ్బ అంటూ ఓ రేంజ్ లో స్టెప్పులు వేశాడు..

SI Dance: ఎమ్మెల్సీ పుట్టిన రోజు వేడుకల్లో అమ్మాయిలతో కలిసి చిరు సాంగ్ కి స్టెప్స్ వేసిన ఎస్సై.. క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అధికారులు
Si Dance In Mlc Duvvada Birthday
Follow us
Surya Kala

|

Updated on: Nov 06, 2022 | 1:21 PM

చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు తన స్ధాయిని మరిచాడు.. డాన్సర్లతో కలిసి అశ్లీల నృత్యాలకు చించేశాడు.. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరలైపోయింది.. అగ్రహించిన ఉన్నతాధికారులు ఆ ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అసలే పోలీసును కదా.. చట్టం నా చుట్టం అనుకున్నాడేమో.. అశ్లీల నృత్యాలకు డాన్సర్లతో కలిసి స్టెప్పులేశాడు. హద్దులు మీరిన వారిని కంట్రోల్‌ చేయాల్సిన SI స్వయాన స్టేజీ ఎక్కేశాడు.. అక్కడి జనం జనం ఈలలు వేసి ప్రోత్సహించడంతో మరింత రెట్టిపోయాడు. తనలో దాగి ఉన్న టాలెంట్‌నంతా బయటకు తీసి మరీ మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ అబ్బనీ తియ్యనీ దెబ్బ అంటూ ఓ రేంజ్ లో స్టెప్పులు వేశాడు.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ హరికృష్ణ తీరు ఇది..

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్భంగా టెక్కలి వెంకటేశ్వర కాలనీలో జరిగిన వేడుకలు ఇవి.. అమ్మాయిల అశ్లీ నృత్యాలు ఊర్రూతలూగించాయి.. టెక్కలి పోలీసు స్టేషన్‌కు పర్లాంగ్‌ దూరంలోనే ఈ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు వచ్చిన టెక్కలి SIహరిహృష్ణ అశ్లీల నృత్యాలు పెట్టిన నిర్వాహకులను మందలించాల్సింది పోయి తానే స్పయంగా స్టేజీ ఎక్కేశారు..పలువురు అమ్మాయిలతో కలిసి అబ్బని తియ్యని దెబ్బ అంటూ సాంగ్ కు ఓ రేంజ్ లో స్టేజ్ మీద స్టెప్స్ వేశాడు.

స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన ఎస్సై 

ఇవి కూడా చదవండి

ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.. వెంటనే క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.. ఎస్సై హరికృష్ణను VRకు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు  నౌపడ ఎస్సై మహమ్మద్ అలీకి టెక్కలి ఇన్చార్జ్ ఎస్సై గా బాధ్యతలను అప్పగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..