AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆస్థి ఇవ్వనన్న తల్లిదండ్రులపై తనయుడు దాడి.. తండ్రి మృతి.. తల్లికి తీవ్ర గాయాలు..

ప్రతిరోజు లాగే ఈరోజు కూడా మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను డబ్బులు కావాలని అడిగాడు. అయితే కొడుకు కోరికను తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో మహేష్ తల్లిదండ్రులు ఇద్దరితో గొడవపడ్డాడు.

Telangana: ఆస్థి ఇవ్వనన్న తల్లిదండ్రులపై తనయుడు దాడి.. తండ్రి మృతి.. తల్లికి తీవ్ర గాయాలు..
Vikarabad District
Surya Kala
|

Updated on: Nov 06, 2022 | 12:51 PM

Share

మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అన్నాడు కార్ల్ మర్క్స్.. ఆ మాటలను నిజం చేస్తూ.. తల్లిదండ్రులు, అన్నదమ్ములు , కడుపున పుట్టిన పిల్లలు అందరూ డబ్బు లోకం దాసోహం అన్న చందంగా నడుస్తున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను ఆస్తికోసం చంపడానికి కూడా వెనుకాడడం లేదు కొందరు పిల్లలు.. తాజాగా తెలంగాణ లో దారుణ ఘటన చోటులో చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే..

వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తమ దగ్గర ఉన్న భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలంటూ ప్రతిరోజు తల్లిదండ్రులను వేధిస్తుండేవాడు కొడుకు మహేష్ (35). ప్రతిరోజు లాగే ఈరోజు కూడా మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను డబ్బులు కావాలని అడిగాడు. అయితే కొడుకు కోరికను తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో మహేష్ తల్లిదండ్రులు ఇద్దరితో గొడవపడ్డాడు. తండ్రి డబ్బులు లేవని చెప్పడంతో ఆవేశానికి లోనైనా మహేష్ పక్కనే ఉన్న కర్ర తీసుకొని ముందుగా తల్లి శ్యామలమ్మ ను చితకబాదాడు. కొడుకు దెబ్బలను భరించలేని తల్లి.. ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఇంట్లో నుంచి పారిపోయింది.

అయితే అక్కడ కొడుకు దాష్టీకాన్ని చూస్తూ.. మౌనంగా కూర్చున్న తండ్రి ని వెనుక నుంచి వచ్చి అదే కర్రతో తలపై ఇష్టానుసారంగా కొట్టాడు. దీంతో తండ్రి మల్లయ్య (68) తలకు బలమైన దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లయ్య మృతి చెందాడని తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాల పాలైన తల్లి శ్యామలమను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

Reporter : Pavankumar Reddy, TV9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..